- Telugu News Photo Gallery Cinema photos Kriti Shetty Stunning Blue Color Photos Goes Viral in Social Media
Krithi Shetty: తస్సాదియ్యా.. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోన్న బేబమ్మ.. అందానికే అసూయ పుట్టిస్తోందిగా..
తెలుగు ప్రేక్షకులకు బేబమ్మగా పరిచయమైంది హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమా విడుదలకు ముందే ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత ఈ అమ్మడుకు అదృష్టం కలిసిరావడం లేదు.
Updated on: Dec 19, 2024 | 11:54 AM

చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది బేబమ్మ అలియాస్ కృతి శెట్టి. బ్లూ కలర్ శారీలో సిగ్గుపడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తాజాగా కృతి శెట్టి లేటేస్ట్ ఫోటోషూట్ నెట్టింట తెగ వైరలవుతుంది.

బ్లూకలర్ సిల్క్ శారీలో మరింత అందంగా కనిపిస్తుంది కృతి. సిల్వర్ జరీ అంచు చీరకట్టులో సింపుల్ గా రెడీ అయ్యింది. ట్రెడీషనల్ లుక్ కు ట్రెండీ లుక్ ఇచ్చి స్టనింగ్ అవుట్ ఫిట్ లో మెరిసిపోతుంది కృతి శెట్టి.

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది కృతి శెట్టి. ఆ తర్వాత బంగర్రాజు, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలతో సూపర్ హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత నటించిన చిత్రాలన్ని ప్లాప్ అయ్యాయి.

దీంతో కృతికి తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి. మొదటి సినిమాతో సంపాదించుకున్న క్రేజ.. ఆ తర్వాత మాత్రం కాపాడుకోలేకపోయింది. ఇప్పుడు మలయాళంలో ఓ ప్రాజెక్ట్ చేస్తుంది కృతి.

అయితే తెలుగులో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది కృతి శెట్టి. అలాగే ఈ అమ్మడుకు తెలుగు, తమిళంలో ఇప్పుడిప్పుడే ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బ్లూ కలర్ శారీలో స్టన్నింగ్ ఫోజులతో మతిపోగొట్టేస్తోంది కృతి.




