Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 41 ఏళ్లైనా చెక్కు చెదరని అందం
హీరోలతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. మహా అంటే 10-12 ఏళ్లు సినిమాలు చేసి మానేస్తారు. పెళ్లి, పిల్లలు.. ఇలా హీరోయిన్లు ఫేడవుట్ అవ్వడానికి చాలా కారణాలున్నాయి. అయితే ఈ హీరోయిన్ మాత్రం 22 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉంది.
పై ఫొటోలో క్యూట్ గా ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడీ క్యూటీ దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. అప్పుడెప్పుడో 1999లో ఒక చిన్న పాత్రతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత మరో రెండేళ్లకే అంటే 2002లో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. అప్పుడు మొదలైన ఆమె సినీ ప్రయాణం గత 22 ఏళ్లుగా నేటికీ కొనసాగుతోంది. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ యాక్ట్ చేస్తోంది. ఇక ఇప్పటి ట్రెండ్ ఓటీటీల కోసం వెబ్ సిరీసుల్లోనూ మెరుస్తోంది. ఇప్పుడీ హీరోయిన్ వయసు సుమారు 41 ఏళ్లు. అయినా చెక్కు చెదరని అందం ఈ ముద్దుగుమ్మ సొంతం. అందుకే నేటికీ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తోంది. కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తూ జెట్ స్పీడ్ లో దూసుకెళుతోంది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష కృష్ణన్. ఇది ఆమె చిన్ననాటి ఫొటో.
ఆ మధ్యన సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన త్రిష పొన్నియన్ సెల్వన్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంది. పొన్నియన్ సెల్వన్ 2, ది రోడ్, లియో సినిమాల్లో నటించిన త్రిష ఈ ఏడాది విజయ్ ది గోట్ లో ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపు అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. అవి కూడా అన్నీ స్టార్ హీరోల మూవీస్
మురుగన్ ఆలయంలో త్రిష పూజలు.. వీడియో ఇదిగో..
View this post on Instagram
తెలుగులో చిరంజీవితో కలిసి విశ్వంభరలో నటిస్తోన్న త్రిష తమిళంలో అజిత్ తో కలిసి రెండు సినిమాలు చేస్తోంది. అలాగే సూర్య 45 లోనూ హీరోయిన్ గా ఎంపికైంది. ఇక కమల్ హాసన్ థగ్ లైప్ లోనూ కథానాయికగా కనిపించనుందీ ముద్దుగుమ్మ. ఇక మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి రామ్ అనే సినిమాలోనూ నటిస్తోంది. వీటితో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు త్రిష చేతిలో ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి, కీరవాణిలతో హీరోయిన్ త్రిష..
View this post on Instagram
సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇటీవల త్రిష కోయంబత్తూరులోని ప్రసిద్ధిగాంచిన మరుదమలై మురుగన్(కుమారస్వామి) ఆలయానికి వెళ్లడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
చిరంజీవి విశ్వంభర సెట్ లో బ్యూటీ క్వీన్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.