Dil Raju: పుట్టిన రోజు నాడే టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు.. రామ్ చరణ్ అభినందనలు
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ)కు చైర్మన్‌గా నియమితులైన నిర్మాత దిల్ రాజుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక అభినందనలు తెలిపాడు. అలాగే బుధవారం (డిసెంబర్ 18) దిల్ రాజు పుట్టిన రోజు కూడా కావడంతో పుష్ప గుచ్ఛం ఇచ్చి విషెస్ తెలిపాడు.
టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత అయితే దిల్ రాజు (వెంకటరమణ రెడ్డి)ని ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ)కు చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు తన పుట్టిన రోజు (డిసెంబర్ 18) సందర్భంగా పదవీ బాధ్యతల్ని స్వీకరించారు. బుధవారం నాడు ఆయన టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి,సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు. చిత్రపరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఈ టీఎఫ్‌డీసీ గతంలో పని చేసేది. మళ్లీ తెలుగు సినిమాకు పూర్వ వైభవం తీసుకు రావాలనే ఉద్దేశంతో నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. తెలంగాణలో ఈ చిత్ర పరిశ్రమను మరింతగా అభివృద్ది చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి వచ్చిన తర్వాత గుర్తింపు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాలి. హైదరాబాద్‌లోనే అన్ని భాషల చిత్రాల షూటింగ్ జరుగుతున్నాయి. అది మున్ముందు మరింతగా అభివృద్ది చెందాలని సీఎం ఆశిస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఎఫ్‌డీసీ, నేను పని చేస్తాను. ఇండస్ట్రీలో ఉన్న ఎగ్జిబిటర్ల, డిస్ట్రిబ్యూటర్ల సమస్యల్ని ప్రభుత్వం వద్దకు తీసుకెళ్తాను. సింగిల్ విండో పర్మిషన్స్ కోసం నిర్మాతలు ఎప్పుడూ కోరుతుంటారు. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం వద్దకు తీసుకెళ్తాను. చిత్ర పరిశ్రమ అభివృద్దికి అన్ని విధాల పాటు పడతాను’ అని చెప్పుకొచ్చారు.
రామ్ చరణ్ అభినందనలు..
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. బుధవారం (డిసెంబర్ 18) దిల్ రాజు పుట్టిన రోజు కావడంతో ఆయన ఇంటికి వెళ్లి పుష్ప గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపాడు గ్లోబల్ స్టార్. అలాగే టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమితులైనందుకు అభినందనలు కూడా తెలిపారు.
దిల్ రాజును కలిసిన గ్లోబల్ స్టార్ .. వీడియో..
Global Star #RamCharan ✨ congratulates Dil Raju garu on becoming Chairman of Telangana Film Development Corporation, making his birthday extra special! 💐#GameChanger#HappyBirthdayDilRaju pic.twitter.com/PzKEr2zo01
— Team RamCharan (@AlwayzRamCharan) December 18, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.