Sritej: శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల.. డాక్టర్లు ఏమంటున్నారంటే?

సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస తీసుకుంటోన్న ఈ పిల్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది పుష్ప 2 చిత్ర బృందం. ఈ నేపథ్యంలో కొద్ది సేపటి క్రితమే శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు డాక్టర్లు.

Sritej: శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
Sritej Family
Follow us
Basha Shek

|

Updated on: Dec 17, 2024 | 10:39 PM

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీ తేజ్ గత పది రోజులుగా కిమ్స్ ఆస్పత్రిలోనే ఉంటున్నాడు. వైద్యులు నిరంతరం అతనిని పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది సేపటి క్రితమే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ‘ శ్రీతేజ్ కు వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నాం. అతని జ్వరం పెరుగుతోంది. కానీ మినిమం ఐనోట్రోప్స్‌లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయి. ఫీడ్‌లను బాగానే తట్టుకుంటున్నాడు. అలాగనీ అతను పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాని మాత్రం ఇప్పుడే చెప్పలేం. స్టాటిక్ న్యూరోలాజికల్ స్థితి దృష్ట్యా, వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకురావడానికి ట్రాకియోస్టోమీని ప్లాన్ చేస్తున్నాం. శ్రీతేజ్‌కు మెదడుకి ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నాం. బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం’ అని వైద్యులు తెలిపారు.

మరోవైపు శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది పుష్ప 2 చిత్ర బృందం. పిల్లాడికి కావాల్సిన అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల సింగపూర్ నుంచి రూ. 4 లక్షల ఇంజెక్షన్ పిల్లాడి కోసం ప్రత్యేకంగా తెప్పించారు. ఇటీవల హీరో అల్లు అర్జున్‌ కూడా రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ప్రకటించారు. ఆలాగే శ్రీ తేజ్ ఆస్పత్రి ఖర్చులు, భవిష్యత్‌లో ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ ఘటన జరిగిన రోజు నుంచి నిర్మాత బన్నీవాస్‌, మైత్రీ నిర్మాతలు, హీరో అల్లు అర్జున్‌ అండ్‌ టీమ్‌ ఎప్పటికప్పుడూ శ్రీతేజ్‌ ఆరోగ్య అప్‌డేట్‌ను తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా నిర్మాత బన్నీవాస్‌ తరుచుగా ఆస్పత్రికి వస్తున్నారు. శ్రీతేజ్‌ యోగాక్షేమాలు కనుక్కుంటున్నారు. ఆ విషయాలను హీరో అల్లు అర్జున్‌కు తెలియజేస్తున్నారు.

శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అల్లు అర్జున్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!