AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ‘అల్లు అర్జున్ రాజకీయ పార్టీ పెడతారు.. సీఎం అవుతారు’.. వేణు స్వామి సంచలన జోస్యం.. వీడియో

పుష్ప 2 సినిమాతో మరోసారి నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యారు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమా అతి తక్కువ టైమ్ లోనే రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్ప 2 సినిమా గురించే చర్చ జరుగుతోంది.

Allu Arjun: 'అల్లు అర్జున్ రాజకీయ పార్టీ పెడతారు.. సీఎం అవుతారు'.. వేణు స్వామి సంచలన జోస్యం.. వీడియో
Venu Swamy, Allu Arjun
Basha Shek
|

Updated on: Dec 16, 2024 | 1:58 PM

Share

డిసెంబర్ 05న విడుదలైన పుష్ప 2 సినిమా ఇప్పటికే రూ. 1300 కోట్ల కలెక్షన్లకు చేరువలో ఉంది. బాలీవుడ్ లోనూ ఈ సినిమా ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మార్మోగిపోతోంది. అయితే ఇంతలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బన్నీ అరెస్ట్ కావడం మరింత సంచలనమైంది. దీంతో ఐకాన్ స్టార్ పేరు మరోసారి ట్రెండ్ అయ్యింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ లాంటి కేంద్ర మంత్రులు సైతం అల్లు అర్జున్ అరెస్టును తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి మరోసారి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలోనే బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నాడని, కొత్త పార్టీ స్థాపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా త్వరలోనే బన్నీ పలు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాడని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జైలుకి వెళ్లిన వారంతా సీఎంలు అవుతున్నారు. అలా అల్లు అర్జున్ కూడా త్వరలోనే కచ్చితంగా సీఎం అయ్యే చాన్స్ ఉంది. 100 శాతం ఆయన కచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతాడు’ అన్నారు.

వేణు స్వామి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై బన్నీ అభిమానులు, నెటిజన్ల నుంచి భిన్నమైన రియాక్షన్లు వస్తున్నాయి. కొందరు వేణుస్వామి మాటలను స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

వేణు స్వామి వీడియో..

అవన్నీ పుకార్లే..

కాగా ఇదివరకే అల్లు అర్జున్ టీమ్ ఈ పొలిటికల్ రూమర్లను ఖండించింది. ‘అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావడం లేదు. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని. దయచేసి ఇలాంటి అసత్యపు వార్తలను ఎంకరేజ్ చేయవద్దని అభ్యర్థిస్తున్నాం. అభిమానుల్లో గందరగోళం సృష్టించడానికి కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఖచ్చితమైన అప్‌డేట్‌ల కోసం, దయచేసి అల్లు అర్జున్ టీమ్ అధికారిక ప్రకటనలకోసం ఎదురుచూడండి’ అని కొద్ది రోజుల క్రితమే ట్వీట్ చేసింది అల్లు అర్జున్ టీమ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.