Keerthy Suresh: మళ్లీ పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్-ఆంటోని.. ఈసారి క్రిస్టియన్ పద్ధతిలో రొమాంటిక్‌గా..

స్టార్ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ పెళ్లి ఇటీవలే తన ప్రియుడు ఆంటోని తట్టిల్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి వేడుక జరిగింది. తాజాగా ఈ దంపతులు మళ్లీ క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లిపీటలెక్కారు.

Keerthy Suresh: మళ్లీ పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్-ఆంటోని.. ఈసారి క్రిస్టియన్ పద్ధతిలో రొమాంటిక్‌గా..
Keerthy Suresh Wedding
Follow us
Basha Shek

|

Updated on: Dec 15, 2024 | 8:53 PM

మహానటి స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవలే తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆంటోని తట్టిల్ ను వివాహం చేసుకుంది. గోవా వేదికగా గురువారం (డిసెంబర్ 12) జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కాఆ హిందూ సంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. ఇప్పటికీ కీర్తి సురేశ్ పెళ్లి ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికీ కీర్తి సురేశ్ పెళ్లి ఫొటోలు ట్రెండింగ్ లో ఉండడం విశేషం. తాజాగా కీర్తి సురేష్ తో కలిసి మళ్లీ క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లిపీటలెక్కినట్లు తెలుస్తోంది. ఆంటోని తట్టిల్‌ తో కలిసి కిస్ చేసుకోవడం, ఇద్దరూ రింగ్స్ మార్చుకోవడం, డ్యాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మరోసారి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా కీర్తి సురేశ్‌ – ఆంథోనీలు దాదాపు 15 ఏళ్ల నుంచి స్నేహితులు. ఈ విషయాన్ని కీర్తి సురేశ్ నే సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీపావళి వేడుకల్లో భాగంగా భర్తతో కలిసి దిగిన ఫొటోని షేర్‌ చేస్తూ దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని క్యాప్షన్ ఇచ్చింది. అంటే స్కూల్‌ డేస్‌ నుంచి ఇద్దరికీ పరిచయం ఉంది. కాలేజీ రోజుల్లో ఆ పరిచయం ప్రేమగా మారిందిని తెలుస్తోంది. ఇక ఆంటోనీది వ్యాపార కుటుంబం. కొచ్చి, చెన్నైలలో అతనికి వ్యాపారాలున్నాయి.

రొమాంటిక్ లుక్ లో కీర్తి సురేశ్- అంటోని తట్టిల్..

సినిమాల విషయానికి వస్తే.. త్వరలోనే బాలీవుడ్ లో నూ ఎంట్రీ ఇవ్వనుంది కీర్తి సురేశ్ . ఆమె నటించిన బేబీ జాన్ ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యింది. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించిన ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా ఈ నెల 25న విడుదల కానుంది.

గోవాలో హిందూ సంప్రదాయ ప్రకారం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి స్టెప్స్ మీరు చూడాల్సిందే...
ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి స్టెప్స్ మీరు చూడాల్సిందే...