- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Telugu Season 2 Winner Kaushal Manda Visits Simhachalam Appanna Temple, See Photos
Bigg Boss Telugu: బిగ్ బాస్ విజేత కౌశల్ ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? లేటెస్ట్ ఫొటోస్ వైరల్
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పుడు ఎనిమిదో సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోనుంది. ఆదివారం (డిసెంబర్ 14) బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే జరగనుంది.
Updated on: Dec 14, 2024 | 9:18 PM

బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో రెండో సీజన ఒక సంచలనమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సీజన్ విజేతగా నిలిచిన కౌశల్ మండా కోసం అభిమానులు ర్యాలీ చేయడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

ఇక కౌశల్ ఆర్మీ పేరిట సోషల్ మీడియాలో ఇతని పేరు తెగ మార్మోగిపోయింది. అయితే ఈ షో తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించిన కౌశల్ ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయాడు.

ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్, టీవీషోస్, ప్రోగ్రామ్స్ ,ఈవెంట్లలోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు తప్పసినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు కౌశల్.

తాజాగా తన భార్య, పిల్లలతో కలిసి సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నాడు కౌశల్. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు.

కౌశల్ మందా సింహాచలం పర్యటనకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతన్నాయి. వీటిని చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.




