- Telugu News Photo Gallery Cinema photos Tollywood is First Place at 1000 Crore Club in Indian film industry top 4 movies from Telugu, details here
Tollywood: 1000 కోట్ల క్లబ్.. ఇదంతా మాకు మామూలు విషయం.! తెలుగు సినిమాలే No.1
ఏ ఇండస్ట్రీకి అయినా 1000 కోట్లు అనేది ఓ పరువుగా మారిందిప్పుడు. ఎప్పటికప్పుడు ఎవరికి ఎన్ని వచ్చాయంటూ లెక్కలేసుకుంటున్నారు. తాజాగా పుష్ప 2తో టాలీవుడ్ ఖాతాలో మరో 1000 కోట్ల సినిమా చేరింది. అసలు ఏ ఇండస్ట్రీకి ఎన్ని 1000 కోట్ల సినిమాలున్నాయి.? అసలు ఆ క్లబ్బులో లేని ఇండస్ట్రీలేవి.? వాళ్లెందుకు రాలేదు.? ఇవన్నీ చూద్దామా.? 1000 కోట్లు అంటే ఒకప్పుడు చాలా పెద్దగా కనిపించేది.. కానీ దాన్ని కూడా మన హీరోలు మామూలు కలెక్షన్స్‌లా మార్చేస్తున్నారు.
Updated on: Dec 14, 2024 | 7:16 PM

ఇదే జరిగితే బాలీవుడ్‌లో సోలోగా 800 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా జరిగితే.. నిర్మాత మైత్రి రవి చెప్పినట్లు 2000 కోట్ల క్లబ్బులో చేరుతుందేమో..?

అసలు ఏ ఇండస్ట్రీకి ఎన్ని 1000 కోట్ల సినిమాలున్నాయి.? అసలు ఆ క్లబ్బులో లేని ఇండస్ట్రీలేవి.? వాళ్లెందుకు రాలేదు.? ఇవన్నీ చూద్దామా.?

1000 కోట్లు అంటే ఒకప్పుడు చాలా పెద్దగా కనిపించేది.. కానీ దాన్ని కూడా మన హీరోలు మామూలు కలెక్షన్స్‌లా మార్చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ప్రభాస్ రెండుసార్లు..

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒక్కోసారి ఈ 1000 కోట్ల మార్క్ అందుకున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా తొలిసారి ఈ క్లబ్బులోకి ఎంట్రీ ఇచ్చారు.మొత్తంగా టాలీవుడ్‌కు నాలుగు 1000 కోట్ల సినిమాలున్నాయి.

ఇండియన్ సినిమాకు 1000 కోట్ల కలెక్షన్లు పరిచయం చేసిందే తెలుగు ఇండస్ట్రీ. బాహుబలి 2తో తొలిసారి 2017లో ఈ మార్క్ చేరుకుంది టాలీవుడ్.

ఆ తర్వాత ఐదేళ్ళకు 2022లో ట్రిపుల్ ఆర్‌తో రెండోసారి.. 2024లో కల్కితో మూడోసారి.. తాజాగా పుష్ప 2తో నాలుగోసారి తెలుగు సినిమాలకు 1000 కోట్లు వచ్చాయి.

మన తర్వాత హిందీ సినిమాకు జవాన్, పఠాన్ రూపంలో రెండు 1000 కోట్ల సినిమాలున్నాయి. కేజియఫ్ 2తో కన్నడ ఇండస్ట్రీ కూడా ఓ సారి 1000 కోట్ల మార్క్ అందుకుంది.

అయితే తమిళ సినిమాలకు ఈ కలెక్షన్లు కనుచూపు మేరలో కూడా లేవు. 500 కోట్ల వరకు ఓకే గానీ.. 1000 మాత్రం కోలీవుడ్‌ను కరుణించట్లేదు. ఇక మలయాళ సినిమాలు కూడా 1000 కోట్లకు దూరంగానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే టాలీవుడ్‌దే అప్పర్ హ్యాండ్.




