- Telugu News Photo Gallery Cinema photos Heroine Rashmika Mandanna Special focus on her next Bollywood movies, Details Here
Rashmika Mandanna: బాలీవుడ్ గడ్డపై నార్త్ హీరోయిన్స్ కంటే ఈ అమ్మడికే ఆఫర్స్ ఎక్కువ.!
తెలుగు హీరోలు ఎలాగూ బాలీవుడ్‌పై దండయాత్ర మొదలుపెట్టారు.. అక్కడి హీరోలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు తోడు హీరోయిన్లు కూడా బ్యాగులేసుకుని బాలీవుడ్‌కు బయల్దేరుతున్నారు. అతిథుల్లా అలా వెళ్లి ఇలా రావడానికి మాత్రం కాదు.. అక్కడే ఉండిపోవడానికి ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అందులో ఓ భామ అందరికంటే ముందున్నారు. మరి ఎవరామె.? టాలీవుడ్ హీరోలకు మాత్రమే కాదు.. హీరోయిన్లకు కూడా ఇప్పుడు పాన్ ఇండియన్ మంత్రం పని చేస్తుంది.
Updated on: Dec 14, 2024 | 6:46 PM

తెలుగు హీరోలు ఎలాగూ బాలీవుడ్‌పై దండయాత్ర మొదలుపెట్టారు.. అక్కడి హీరోలకు నిద్ర లేకుండా చేస్తున్నారు.

ఇప్పుడు వాళ్లకు తోడు హీరోయిన్లు కూడా బ్యాగులేసుకుని బాలీవుడ్‌కు బయల్దేరుతున్నారు. అతిథుల్లా అలా వెళ్లి ఇలా రావడానికి మాత్రం కాదు.. అక్కడే ఉండిపోవడానికి ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.

ఇలా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ విషయంలో ఫుల్ హ్యాపీగా ఉన్న రష్మిక, అవకాశం వచ్చిన ప్రతీసారి తన ఎగ్జైట్మెంట్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు.

ముఖ్యంగా సౌత్ హీరోయిన్లకు అక్కడ్నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాబోయే బాలీవుడ్ ఫ్యూచర్ అంతా రష్మిక మందన్ననే కనిపిస్తున్నారు.

ఈమెతో నాలుగు భారీ పాన్ ఇండియన్ సినిమాలున్నాయిప్పుడు. పుష్ప 2తో నేషనల్ క్రష్ రేంజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం హిందీలో మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ రష్మిక.

అక్కడి హీరోయిన్లకు కూడా రాని విధంగా ఈమెకు ఆఫర్స్ వస్తున్నాయి. విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ఛావాలో మహారాష్ట్ర క్వీన్‌గా నటిస్తున్నారు రష్మిక. అలాగే సల్మాన్ ఖాన్ సికిందర్‌లోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారీ బ్యూటీ.

స్త్రీ 2 మేకర్స్ నుంచి వస్తున్న తమ్మాలోనూ రష్మికనే హీరోయిన్. ఆయుష్మాన్ ఖురానా ఇందులో హీరో. వీటన్నింటితో పాటు సందీప్ వంగా తెరకెక్కించబోయే యానిమల్ పార్క్ రష్మిక చేతిలో ఉంది.

ఇందులో యానిమల్ పార్క్ మినహా.. మిగిలిన మూడు సినిమాలు 2025లోనే రానున్నాయి. ఇవన్నీ హిట్టైతే రష్మిక రేంజ్ మరింత పెరగడం ఖాయం.




