AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SS Rajamouli: ‘లంచ్‌కొస్తావా.. మంచ్‌కొస్తావా’.. హీరో పెళ్లిలో భార్యతో కలిసి జక్కన్న డ్యాన్స్.. వీడియో ఇదిగో

ఎప్పుడూ కెమెరాల వెనక ఉండే దర్శక ధీరుడు రాజమౌళి హీరోలా రెచ్చిపోయాడు. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగాఆ భార్యతో కలిసి డ్యాన్స్ అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది.

SS Rajamouli: 'లంచ్‌కొస్తావా.. మంచ్‌కొస్తావా'.. హీరో పెళ్లిలో భార్యతో కలిసి జక్కన్న డ్యాన్స్.. వీడియో ఇదిగో
SS Rajamouli
Basha Shek
|

Updated on: Dec 14, 2024 | 8:38 PM

Share

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు, హీరో శ్రీసింహ కొత్త జీవితం ప్రారంభించనున్నాడు. సీనియర్‌ నటుడు, రాజకీయ నాయకుడు మురళీ మోహన్‌ మనవరాలు రాగ మాగంటితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా సంగీత్ వేడుక గ్రాండ్ గా నిర్వహించారు. ఈ క్రమంలోనే సతీసమేతంగా అన్న కుమారుడి వివాహానికి హాజరయ్యారు జక్కన్న. సంగీత్ లో భాగంగా భార్య రమా రాజమౌళతో కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు. రవితేజ- పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ‘లంచ్‌కొస్తావా.. మంచ్‌కొస్తావా.. పాటకు స్టెప్పులేశారు రాజమౌళి. స్టేజీపై భార్యతో కలిసి రాజమౌళి మాస్‌ స్టెప్పులు వేసిన డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. శ్రీసింహ విషయానికి వస్తే.. రాజమౌళి తీసిన పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. విక్రమార్కుడు, యమదొంగ, మర్యాద రామన్న సినిమాల్లో తళుక్కున మెరిశాడు శ్రీ సింహా. ఆ తర్వాత తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్‌ తదితర సినిమాల్లో హీరోగా నటించాడు. ముఖ్యంగా ‘మత్తు వదలరా-1,2 సినిమాలతో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు

ఇవి కూడా చదవండి

ఇక ఎస్‌.ఎస్‌.రాజమౌళి విషయానికి వస్తే.. మహేశ్ బాబు హీరోగా ఓ యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమా పట్టాలెక్కింనున్నాడు. ఎస్‌ఎస్‌ఎంబీ 29 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మహేశ్‌ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇందుకోసం తన ఫిజిక్ ను కూడా పూర్తిగా మార్చేసుకున్నాడు మహేశ్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

రాజమౌళి డ్యాన్స్ వీడియో ఇదిగో..

మురళి మోహన్ మనవరాలి డ్యాన్స్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!