Razakar OTT: 9 నెలల తర్వాత ఓటీటీలోకి అనసూయ కాంట్రవర్సీ సినిమా.. ‘రజాకార్’ ఎక్కడ చూడొచ్చంటే?

తెలంగాణ విముక్తి పోరాటం, హైదరాబాద్ విలీనం వంటి చారిత్రాత్మక అంశాల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ర‌జాకార్‌’. రాజ‌కీయంగా ఎన్నో వివాదాల‌కు కేంద్రంగా నిలిచిన ఈ చిత్రం మార్చిలో థియేటర్లలో విడుదలైంది. సుమారు 9నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

Razakar OTT: 9 నెలల తర్వాత ఓటీటీలోకి అనసూయ కాంట్రవర్సీ సినిమా.. 'రజాకార్' ఎక్కడ చూడొచ్చంటే?
Razakar Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 13, 2024 | 8:19 PM

భార‌త‌దేశంలో హైద‌రాబాద్ సంస్థానం విలీనం, రజాకార్ల పాలన వంటి చారిత్రాత్మక అంశాలన స్పృశిస్తూ తెరకెక్కిన చిత్రం రజాకార్. యాట స‌త్య‌నారాయ‌ణ‌ తెరకెక్కించిన ఈ సినిమాలో అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, బాబీ సింహా, వేదిక‌, ప్రేమ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, రాజ్ అర్జున్‌, తేజ్ స‌ప్రు, జాన్ విజ‌య్‌, దేవీ ప్ర‌సాద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రిలీజ్ కు ముందే రాజకీయంగా ఎన్నో వివాదాలు ఎదుర్కొంది రజాకార్ సినిమా. అయితే అన్ని అడ్డంకులను దాటి మార్చి 15న థియేట‌ర్ల‌లో రిలీజైంది. కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ కొన్ని వర్గాలను మాత్రమే మెప్పించింది. అయితే థియేటర్లలో రిలీజై ఇన్ని రోజులు గడిచినా రజాకార్ ఓటీటీలోకి రాలేదు. అయితే ఎట్ట‌కేల‌కు ఈ కాంట్రవర్సీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా రజాకార్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. త్వ‌ర‌లోనే ర‌జాకార్‌ను ఓటీటీ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు అధికారికంగా వెల్ల‌డించింది. ఈ మేర‌కు సోషల్ మీడియాలో ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. డిసెంబ‌ర్ 20 లేదా 26న ర‌జాకార్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన రానుంది.

గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మించిన రజకార్ సినిమాకు ధమాకా ఫేమ్ భీమ్స్ సిసిరోలియో స్వరాలు అందించారు. నిజాం పాల‌న‌లో ర‌జాకార్లు ఓ వ‌ర్గం వారిని టార్గెట్ చేస్తూ ఎలాంటి దురాగ‌తాలకు పాల్ప‌డ్డార‌నే అంశాలతో రజాకార్ సినిమా కథను రాసుకున్నారు. ఇదే కొన్ని వర్గాల ఆగ్రహానికి కారణమైంది. రిలీజ్ సమయంలో ఈ మూవీపై కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు కూడా గుప్పించాయి. అందుకు తగ్గట్టుగానే థియేటర్లలో ఓ వర్గం వారిని మాత్రమే రజాకార సినిమా మెప్పించింది. ఇప్పుడు సుమారు 9 నెలల తర్వాత ఈ కాంట్రవర్సీ సినిమా ఓటీటీలోకి రానుంది.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

రజాకార్ సినిమాలో అనసూయ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓటీటీలోకి అనసూయ కాంట్రవర్సీ సినిమా.. 'రజాకార్' ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి అనసూయ కాంట్రవర్సీ సినిమా.. 'రజాకార్' ఎక్కడ చూడొచ్చంటే?
పెండింగ్ గ్రాంట్ నిధులను వెంటనే విడుదల చేయాలిః రేవంత్
పెండింగ్ గ్రాంట్ నిధులను వెంటనే విడుదల చేయాలిః రేవంత్
అత్యంత శక్తిమంతమైన మహిళగా నిర్మలాసీతారామన్..వరుసగా ఆరోసారి ఛాన్స్
అత్యంత శక్తిమంతమైన మహిళగా నిర్మలాసీతారామన్..వరుసగా ఆరోసారి ఛాన్స్
ఒంటరిగా ప్రయనించడంపై నిషేధం.. కారణం తెలిస్తే షాక్
ఒంటరిగా ప్రయనించడంపై నిషేధం.. కారణం తెలిస్తే షాక్
సరిహద్దుల్లో యుద్దాలు చేశారా.?
సరిహద్దుల్లో యుద్దాలు చేశారా.?
బాబర్ అజమ్‌పై వేధింపుల కేసు: కోర్టులో కొత్త వాదనలతో న్యాయపోరాటం..
బాబర్ అజమ్‌పై వేధింపుల కేసు: కోర్టులో కొత్త వాదనలతో న్యాయపోరాటం..
'దేవుళ్లను కూడా అరెస్ట్ చేస్తారా?' ఆర్జీవీ సంచలన ట్వీట్
'దేవుళ్లను కూడా అరెస్ట్ చేస్తారా?' ఆర్జీవీ సంచలన ట్వీట్
అరెస్ట్ మొదలు బెయిల్ వరకు.. పుష్ప పార్ట్-3 చూపించేశారుగా!
అరెస్ట్ మొదలు బెయిల్ వరకు.. పుష్ప పార్ట్-3 చూపించేశారుగా!
5 రోజుల్లో మూడు యోగాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభాలు..!
5 రోజుల్లో మూడు యోగాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభాలు..!
సంకటహర చతుర్ధి రోజున గణపతిని ఎలా పూజించాలి? శుభ సమయం ఎప్పుడంటే
సంకటహర చతుర్ధి రోజున గణపతిని ఎలా పూజించాలి? శుభ సమయం ఎప్పుడంటే