Ram Charan: ఎట్టకేలకు కూతురి ఫొటోను షేర్ చేసిన ఉపాసన.. తాతయ్య చేతిలో క్లీంకార ఎంత క్యూట్‌గా ఉందో!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు గతేడాది జూన్ లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. తమ గారాల పట్టికి క్లీంకార కొణిదెల అని నామకరణం చేశారు. అయితే ఇప్పటివరకు మెగా ప్రిన్సెస్ ముఖాన్ని మాత్రం బయటకు చూపించలేదు.

Ram Charan: ఎట్టకేలకు కూతురి ఫొటోను షేర్ చేసిన ఉపాసన.. తాతయ్య చేతిలో క్లీంకార ఎంత క్యూట్‌గా ఉందో!
Ram Charan Family
Follow us
Basha Shek

|

Updated on: Dec 12, 2024 | 7:55 PM

రామ్ చరణ్-ఉపాసన దంపతులకు గత ఏడాది జూన్ 20న క్లీంకార జన్మించింది. అయితే తమ కూతురి విషయంలో ఎంతో గోప్యత పాటిస్తున్నారు గ్లోబల్ స్టార్ కపుల్. తమ బిడ్డకు సంబంధించిన వివరాలు, ఫోటోస్, వీడియోస్ బయటికి రాకుండా మెగా ఫ్యామిలీ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఎట్టకేలకు మెగా ప్రిన్సెస్ క్లింకార కొణిదెల ఫొటోను షేర్ చేసింది ఉపాసన. రామ్ చ‌ర‌ణ్ – ఉపాస‌న దంప‌తుల గార‌ల‌ప‌ట్టి క్లీంకార గుడికి వెళ్లింది. త‌న తాత‌య్య‌తో క‌లిసి అపోలో ఆసుప‌త్రిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆల‌యాన్ని ద‌ర్శించుకుంది. ఈ విష‌యాన్ని ఉపాస‌న సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ‘ముత్తాత (ఉపాసన తాతయ్య ప్ర‌తాప్ రెడ్డి), తాతయ్య (ఉపాసన తండ్రి అనిల్ కామినేని)తో కలిసి క్లీంకార అపోలో ఆస్పత్రిలోని ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పవిత్రోత్సవాల్లో పాల్గోంది. క్లీంకార‌ను త‌న తాతయ్య ఎత్తుకోవ‌డం చూస్తుంటే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. అలాగే ఈ దేవాలయానికి నా మనసులో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది’ అని చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంది ఉపాసన. ఇక పోస్టు చివరిలో ‘ఓం నమో వేంకటేశాయ’ అని కూడా రాసుకోచ్చింది మెగా డాటర్.

ఇవి కూడా చదవండి

ప్ర‌స్తుతం ఉపాసన షేర్ చేసిన పోస్ట్  సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. యితే ఈ పోస్టులో క్లీంకార ఫొటోను కాస్త బ్ల‌ర్ చేసి షేర్ చేసింది ఉపాస‌న‌. అయతేనేం తాతయ్య చేతిలో క్లింకార ఎంతో క్యూట్ గా ఉందంటున్నారు అభిమానులు.

ఉపాసన షేర్ చేసిన పోస్ట్..

ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. దీని తర్వాత ఉప్పెన బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాను పట్టాలెక్కించాడు గ్లోబల్ స్టార్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.