Allu Arjun: రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. క్లారిటీ ఇచ్చిన టీమ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసిన ఈ సినిమా నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. థియేటర్స్ దగ్గర పుష్ప 2 సందడి మాములుగా లేదు. ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప 2 సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఘనవిజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం గత వారం విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్లను దాటేసింది. అలాగే ఆరు రోజుల్లోనే రూ.1000కోట్లు వసూల్ చేసింది. ‘పుష్ప 2’ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఈ చిత్రాన్ని వీక్షించారు. ఇప్పుడు ‘పుష్ప 2’ టీమ్ గ్రాండ్ సక్సెస్ మీట్ ప్లాన్ చేసి ఢిల్లీలో గ్రాండ్ సక్సెస్ పార్టీ జరుపుకుంటోంది.
ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ..! ఈ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..! ఒకప్పటి డ్రీమ్ గర్ల్‌ను గుర్తుపట్టరా.?
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ అక్కడ శిల్ప రవికి మద్దతు తెలిపారు. దాంతో అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. దాంతో ఇప్పుడు అల్లు అర్జున్ టీమ్ దీని పై క్లారిటీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి :Jagapathi Babu: నువ్వంటే నాకు ఇష్టం లేదు.. స్టార్ హీరోయిన్ ముఖంమీదే చెప్పిన జగపతి బాబు.
అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నారన్న పుకార్ల పై స్పందించిన అల్లు అర్జున్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తారని ఇటీవల వచ్చిన పుకార్లు పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేసింది అల్లు అర్జున్ టీమ్. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలు దయచేసి వ్యాప్తి చేయకుండా ఉండవలసిందిగా మేము మీడియా సంస్థలు, వ్యక్తులను దయతో అభ్యర్థిస్తున్నాము. ఖచ్చితమైన అప్‌డేట్‌ల కోసం, దయచేసి అల్లు అర్జున్ టీమ్ అధికారిక ప్రకటనలకోసం ఎదురుచూడండి అని అల్లు అర్జున్ టీమ్ చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.