Pushpa 2: పుష్పలో ఆ పాత్ర నేనే చెయ్యాలి.. కానీ వదులుకున్నా.. షాకింగ్ విషయం చెప్పిన హీరో

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసింది ఈ సినిమా. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.

Pushpa 2: పుష్పలో ఆ పాత్ర నేనే చెయ్యాలి.. కానీ వదులుకున్నా.. షాకింగ్ విషయం చెప్పిన హీరో
Pushpa 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 12, 2024 | 7:07 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. అల్లు అర్జున్ పుష్ప 2 విడుదలై 7 రోజులు అయ్యింది. వెయ్యికోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇండియాలోనే ఫాస్టెస్ట్ 1000కోట్లు వసూల్ చేసిన సినిమాగా పుష్ప 2 సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. విడుదలకు ముందే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన ‘పుష్ప 2’ ఇప్పుడు అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా రూ.1032 కోట్లు వసూలు చేసిందని తెలుస్తుంది.  ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా జాతర సీన్ లో అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు. అలాగే ఈ సినిమాలో యాక్షన్స్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి.

ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ..! ఈ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..! ఒకప్పటి డ్రీమ్ గర్ల్‌ను గుర్తుపట్టరా.?

ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నాను అని ఓ హీరో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. వేరే సినిమాల్లో బిజీ అవడంతో పుష్ప సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నాను అని చెప్పుకొచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు. టాలెంటడ్ హీరో సుహాస్. అవును సుహాస్ పుష్ప సినిమాలో ఛాన్స్ సుహాస్ మిస్ చేసుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో సుహాస్ మాట్లాడుతూ.. పుష్ప సినిమా కేశవ పాత్రలో సుహాస్ నటించాల్సి ఉందట.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Jagapathi Babu: నువ్వంటే నాకు ఇష్టం లేదు.. స్టార్ హీరోయిన్ ముఖంమీదే చెప్పిన జగపతి బాబు.

అయితే పుష్ప సమయంలోనే తనకు హీరోగా కలర్ ఫోటో సినిమా ఛాన్స్ రావడంతో పుష్ప సినిమాను మిస్ చేసుకున్నాను అని తెలిపాడు సుహాస్. పుష్ప మిస్ చేసుకున్నందుకు చాలా బాధపడ్డాను. పెద్ద సినిమా మంచి బ్రేక్ వచ్చేది అని భయపడుతూనే కలర్ ఫోటో చేశాను అని తెలిపాడు సుహాస్. ఇక కలర్ ఫోటో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. కలర్ ఫోటో తర్వాత సుహాస్ ఫుల్ లెన్త్ హీరోగా మారిపోయాడు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. ఇటీవలే జనక అయితే గనక అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

View this post on Instagram

A post shared by Suhas (@suhassssssss)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న బస్సు ప్రమాద దృశ్యాలు..!
ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న బస్సు ప్రమాద దృశ్యాలు..!
తగ్గేదేలే.. పుష్ప2 థ్యాంకూ ఇండియా ప్రెస్‌మీట్.. లైవ్ వీడియో
తగ్గేదేలే.. పుష్ప2 థ్యాంకూ ఇండియా ప్రెస్‌మీట్.. లైవ్ వీడియో
ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..
ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..
చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.
చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.
పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..
పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..
ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము
ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము
మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.
మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.
మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!
మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!
రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?
రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?
మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..
మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..