Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరోయిన్.. ఆమెనే ఎందుకబ్బా..!
వర్సటైల్ యాక్టర్ గా ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతున్నారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. హీరోగా సినిమాలు చేస్తూనే.. విలన్ గా రాణిస్తున్నారు. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు విజయ్ సేతుపతి.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. ఆయన గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు విజయ్ సేతుపతి. హీరోగానే కాదు విలన్ గానూ నటించి మెప్పిస్తున్నాడు విజయ్ సేతుపతి. తమిళ, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించాడు. విజయ్ సేతుపతి తమిళంలో వచ్చిన ‘తెన్మెర్కు పరువాకత్రు’ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. అలాగే విజయ్ సేతుపతి హీరోగా నటించిన పిజ్జా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. ఆయన తమిళంలో నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా, పాటల రచయితగా, గాయకుడిగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశాడు.
ఇది కూడా చదవండి :10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు.. ఇప్పుడు ఒకొక్క సినిమాకు రూ. 20కోట్లు అందుకుంటుంది
హీరోగానే కాదు విలన్ గాను ప్రేక్షకులను మెప్పించాడు విజయ్ సేతుపతి. తెలుగులో ఉప్పెన సినిమాలో విలన్ గా నటించాడు. అంతకన్నా ముందు తెలుగులో 2019లో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2021లో ఉప్పెన సినిమాలోని రాయణం పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ఇక హిందీలోనూ నటించి మెప్పించారు. అక్కడ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో విలన్ గా చేశాడు. అలాగే మేరీ క్రిస్మస్ సినిమాలోనూ నటించాడు.
ఇది కూడా చదవండి :కోట్లకొద్దీ ఆస్తులు.. లెక్కలెన్నని లగ్జరీ కార్లు.. అయినా ఆటోలో తిరుగుతున్న అందాల భామ..
ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్ గా ఉండరు. తన సినిమా అప్డేట్స్ అడపాదడపా ఇస్తూ ఉంటాడు. ఇక ఇన్ స్టా గ్రామ్ లో ఒకే ఒక్క హీరోయిన్ ను ఫాలో అవుతున్నారు. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె తెలుగు ముద్దుగుమ్మ అంజలి. ఈ బ్యూటీ తమిళ్ లో తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక విజయ్ అంజలి కలిసి ఐరావి, సింధుబాద్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం అంజలి తమిళ్ తో పాటు తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటించి ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.
Naga Chaitanya: ఆ హీరోయిన్ అంటే నాకు వణుకు.. షాకింగ్ విషయం చెప్పిన నాగ చైతన్య
View this post on Instagram
హీరోయిన్ అంజలి ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.