AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: పుష్ప2 కోసం ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా.?

డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తొలి రోజే భారీ వసూళ్లను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప 2 బ్లాక్ బస్టర్ అవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Pushpa 2: పుష్ప2 కోసం ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా.?
Pushpa 2
Rajeev Rayala
|

Updated on: Dec 07, 2024 | 11:45 AM

Share

5న థియేటర్లలో విడుదలైన అల్లు అర్జున్ ‘పుష్ప 2 ది రూల్’ సినిమా దుమ్మురేపుతోంది. పుష్ప మొదటి భాగంలో, అల్లు అర్జున్ పాత్ర పుష్ప కూలీగా జీవితాన్ని ప్రారంభించి, స్మగ్లింగ్ ముఠాకు నాయకుడు అయ్యేంతవరకు ఉంటుంది. ఆతర్వాత ఇప్పుడు పుష్ప 2 లో అసలు కథను చూపించాడు సుకుమార్. పుష్ప: ది రైజ్ అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాజిల్, అజయ్ గోష్, సునీల్ ప్రధాన తారాగణంగా నటించారు. ఈ మూవీ 2021లో విడుదలైన చిత్రం. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మామూలుగా ‘డాన్’, ‘గ్యాంగ్ స్టర్’ సినిమాల్లో కనిపించే కథే అయినా ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన, మ్యానరిజమ్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సినిమా ఘన విజయం సాధించింది.

కోతి కొమ్మచ్చి ఆడుతున్న ఈ కుర్రాళ్లలో ఓ స్టార్ హీరో ఉన్నాడు.. అమ్మాయిలు వెర్రెక్కిపోతారు అతనంటే.. 

ఇక ఇప్పుడు మొదటి భాగంలో కూలీగా కనిపించిన అల్లు అర్జున్ రెండో భాగంలో పెద్ద స్మగ్లింగ్ కింగ్‌పిన్‌గా కనిపించాడు. సినిమా థియేటర్లలో అదిరిపోయే విజువల్స్ తో ఆకట్టుకుంటుంది. దాదాపు 3 గంటల 25 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా తొలి రోజెక్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పుష్ప 2 సినిమా విడుదలకు ముందే ప్రీ బుకింగ్ లోనే 100 కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం. అలాగే తొలిరోజు వసూళ్ల విషయానికొస్తే..సినిమా 175 కోట్ల వరకు వసూలు చేసిందని సమాచారం. ఈ నేపథ్యంలో సినిమాలో నటించిన నటీనటుల పారితోషికం ఎంత అనేది ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి.

Tollywood : నా బాడీ నా ఇష్టం.. నేను ఇలానే ఉంటాను.. తెగేసి చెప్పిన టాలీవుడ్ సింగర్

పుష్ప చిత్రంలో నటించినందుకు నటుడు అల్లు అర్జున్ 300 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకున్నారు, దర్శకుడు సుముమార్ ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయలు, నటి రష్మిక మంధాన ఈ చిత్రంలో నటించినందుకు 10 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నారు. ఈ సినిమాలో నటించినందుకు నటుడు ఫహద్ ఫాజిల్ రూ.8 కోట్ల పారితోషికం అందుకున్నారని, మ్యూజిక్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ రూ.5 కోట్ల పారితోషికం తీసుకున్నారని సమాచారం. అలాగే స్పెషల్ సాంగ్ లో అదరగొట్టిన శ్రీలీల రూ. 2 కోట్లు అందుకుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి