Tollywood : నా బాడీ నా ఇష్టం.. నేను ఇలానే ఉంటాను.. తెగేసి చెప్పిన టాలీవుడ్ సింగర్
సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రెటీలు సోషల్ మీడియా కారణంగా ట్రోల్స్ బారిన పడుతూ ఉంటారు. చాలా మంది హీరోయిన్స్, సింగర్స్ చాలా మంది ట్రోల్స్ బారిన పడుతూ ఉంటారు. తాజాగా ఓ టాలీవుడ్ సింగర్ తన పై వచ్చే ట్రోల్స్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
సినిమా సెలబ్రెటీలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో .. దాని వల్ల నష్టం కూడా అంతే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా చాలా మంది సెలబ్రెటీలు, ముఖ్యంగా హీరోయిన్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతే కాదు హీరోయిన్స్ చాలా మంది లేనిపోని వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. దాంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. వివాదాస్పద కామెంట్స్ చేసో లేక, వింత డ్రస్సుల వల్లో ఎదో ఒకరకంగా ట్రోల్స్ కు గురవుతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్స్ తమ డ్రస్సింగ్ కారణంగా ట్రోల్స్ బారిన పడుతూ ఉంటారు. తాజాగా ఓ టాలీవుడ్ సింగర్ కూడా తన డ్రస్సింగ్ కారణంగా ట్రోల్స్ బారిన పడింది. అంతే కాదు ఆ ట్రోల్స్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.
ఇద్దరు మెగాహీరోలతో సినిమాలు చేసింది.. ఇప్పుడు ఛాన్స్‌లు లేక ఇలా..
ఇంతకూ ఆ సింగర్ ఎవరో తెలుసా..? ఆమె రూపమే కాదు.. ఆమె గొంతు కూడా అందమే.. తన మదురమైన గొంతుతో ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించింది. అందంలో హీరోయిన్స్ తో పోటీపడుతుంది ఈ ముద్దుగుమ్మ. తన పై వచ్చే ట్రోల్స్ ను పట్టించుకోనూ అంటుంది ఆ భామ. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు ముద్దుగుమ్మ దామిని భట్ల. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలోని పచ్చబొట్టేసినా అనే పాట ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సాంగ్ తోనే ఫెమ్స్ అయ్యింది దామిని భట్ల.
అమ్మబాబోయ్..! అస్సలు గుర్తుపట్టలేం గురూ..!! ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
సింగర్ గా ఎన్నో అద్బుతమైన పాటలు ఆలపించిన దామిని.. అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుని దామిని. పాడుతా తీయగా, సరిగమ లిటిల్ చాంప్స్ వంటి షోలతో ఫెమస్ అయిన దామిని.. సింగర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆతర్వాత సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది. 2014లో సింగర్ గా కెరీర్ గా మొదలు పెట్టింది ఈ చిన్నది. లవ్ ఇన్ లండన్, బాహుబలి ది బిగినింగ్, మనసంతాఇలా చాలా సినిమాల్లో పాటలు పాడి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దామిని మాట్లాడుతూ.. తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడింది. అలాగే బిగ్ బాస్ లో తన అనుభవాల గురించి కూడా మాట్లాడింది. వీటితో పాటు తన పై వచ్చిన ట్రోల్స్ గురించి కూడా మాట్లాడింది. నా బాడీ నా ఇష్టం, నా బట్టలు నా ఇష్టం.. నేను ఇలానే ఉంటాను. నేను ఎలా ఉన్నా కామెంట్స్ చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు. పాజిటివిటీని నెగిటివ్ గా చూసి స్ప్రెడ్ చేసేవారు చాలా మంది ఉంటారు అలాంటివాటిని, అలంటి వారిని పట్టించుకోకపోవడమే బెటర్ అని చెప్పుకొచ్చిది దామిని.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.