- Telugu News Photo Gallery Cinema photos Heroine Pooja Hegde finalized in Dulquer Salmaan next movie in Tollywood details here
Dulquer Salmaan: దుల్కర్ తో చేస్తే హీరోయిన్లకు స్పెషల్ క్రేజ్ వస్తుందా.! నెక్స్ట్ పూజ నే..
కొందరు హీరోలకు తెలిసో, తెలియకో ఓ ఇమేజ్ వచ్చేస్తుంది. దుల్కర్ సల్మాన్ కి కూడా తెలుగులో అలాంటి ఇమేజే ఉంది. ఆయన సినిమాల్లో ఏ హీరోయిన్ నటించినా తప్పక పేరు తెచ్చుకుంటారని. అంత స్కోప్ ఆయన ఇస్తారూ అని. మహానటి టు లక్కీ భాస్కర్.. కంటిన్యూ అవుతున్న ఈ క్రేజ్‌ని త్వరలోనే పూజా హెగ్డే కూడా సొంతం చేసుకుంటారా.? మహానటి సినిమా సావిత్రి బయోపిక్ అయినా, కీర్తీ సురేషే హైలైట్ అయినా.. అమ్మాడి అమ్మాడి అంటూ ఫుల్ క్రెడిట్ కొట్టేశారు దుల్కర్ సల్మాన్.
Updated on: Dec 06, 2024 | 9:09 AM

కొందరు హీరోలకు తెలిసో, తెలియకో ఓ ఇమేజ్ వచ్చేస్తుంది. దుల్కర్ సల్మాన్ కి కూడా తెలుగులో అలాంటి ఇమేజే ఉంది. ఆయన సినిమాల్లో ఏ హీరోయిన్ నటించినా తప్పక పేరు తెచ్చుకుంటారని.

అంత స్కోప్ ఆయన ఇస్తారూ అని. మహానటి టు లక్కీ భాస్కర్.. కంటిన్యూ అవుతున్న ఈ క్రేజ్‌ని త్వరలోనే పూజా హెగ్డే కూడా సొంతం చేసుకుంటారా.?

మహానటి సినిమా సావిత్రి బయోపిక్ అయినా, కీర్తీ సురేషే హైలైట్ అయినా.. అమ్మాడి అమ్మాడి అంటూ ఫుల్ క్రెడిట్ కొట్టేశారు దుల్కర్ సల్మాన్.

ఆయన పక్కనుంటే హీరోయిన్లు స్క్రీన్ మీద మరింతగా గ్లోరిఫై అవుతారన్నది ఇండస్ట్రీలో ఉన్న మాట. సీతారామమ్‌లో మృణాల్ ఠాకూర్‌కి కూడా అంతే స్క్రీన్ స్పేస్ దక్కింది.

ఇన్‌ఫ్యాక్ట్ సీతారామమ్ జంటని మళ్లీ మళ్లీ వెండితెరమీద చూడాలని కోరుకున్న వారు కోకొల్లలు. అంతగా మెప్పించింది దుల్కర్, మృణాల్ కెమిస్ట్రీ. రీసెంట్‌గా లక్కీ భాస్కర్‌లోనూ మీనాక్షి చౌదరికి అలాంటి ఫెసిలిటీ కల్పించారు దుల్కర్.

వారిద్దరూ భార్యాభర్తలుగా నటించారు ఈ సినిమాలో. ప్రతి సన్నివేశంలోనూ ఒకరిని మించి మరొకరు నేచురల్‌గా నటించారు.

త్వరలోనే ఇలాంటి ఛాన్స్ పూజా హెగ్డేకి రాబోతోందన్నది ఫిల్మ్ నగర్ న్యూస్. ఓ కొత్త డైరక్టర్ చెప్పిన కథకు దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇందులో పూజా హెగ్డేని హీరోయిన్‌గా అనుకుంటున్నారట.

అదే జరిగితే.. చాన్నాళ్లుగా తెలుగులో రీ ఎంట్రీకి ట్రై చేస్తున్న పూజా హెగ్డేకి జబర్దస్త్ ఛాన్స్ అవుతుందంటూ సంబరపడుతున్నారు ఫ్యాన్స్.





























