- Telugu News Photo Gallery Cinema photos Do You Know Pushpa 2 movie Villain Fahadh Faasil Life Style and Net Worth
Fahadh Faasil: పుష్ప 2 విలన్ భన్వర్ సింగ్ షెకావత్ ఆస్తులు ఇన్ని కోట్లా.? ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప 2 సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున నుంచే ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. ఈ సినిమాలో మలయాళీ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
Updated on: Dec 05, 2024 | 8:46 PM

పుష్ప 2 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళీ హీరో ఫహద్ ఫాసిల్. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో మెప్పించాడు. మలయాళం, తెలుగు, తమిళం భాషలలో నటిస్తున్నాడు ఫహాద్.

మలయాళీ దర్శకుడు ఫాసిల్ తనయుడు ఫహద్ ఫాసిల్. 2002లో 'కయ్యాయేతున్ దూరత్'తో తెరంగేట్రం చేసాడు. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.

ఆ తర్వాత 2009లో 'కేరళ కేఫ్' , 'చప్పా కురిషు' అతడి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. 50కి పైగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ఇటీవలే ఆవేశం సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు.

2014లో నిర్మాతగా మారి సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించాడు. ఫహాద్ ఫాసిల్ ఆస్తులు దాదాపు రూ.50 కోట్లు ఉంటుందని సమాచారం. ఒక్కో సినిమాకు రూ.3.5 నుంచి 6 కోట్లు తీసుకుంటారట.

అతడికి కార్లు అంటే చాలా ఇష్టమట. పోర్షే 911, మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్, రేంజ్ రోవర్ వోగ్ వంటి కార్లు ఉన్నాయి. కొచ్చిలో విలాసవంతమైన ఇల్లు ఉంది. 2014లో హీరోయిన్ నజ్రియా నజీమ్‌ను వివాహం చేసుకున్నాడు.




