- Telugu News Photo Gallery Cinema photos Do You know This Heroine Acted With Chiranjeevi, Pawan Kalyan and Ram Charan, She is Kajal
Tollywood: చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్‌తో నటించిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.. ?
సోషల్ మీడియాలో నటీనటుల చిన్ననాటి ఫోటోస్ చక్కర్లు కొట్టడం కామన్. తాజాగా ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ పిక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్. విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న అందాల తార.
Updated on: Dec 05, 2024 | 8:23 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి మరెవరో కాదు. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చందమామ సినిమాతో తెలుగులో స్టార్ డమ్ అందుకుంది. ఈ సినిమా తర్వాత కాజల్ కు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వచ్చాయి.

అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సరసన నటించిన ఏకైక హీరోయిన్. చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 చిత్రంలో నటించింది.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే పవన్, కాజల్ జోడిగా అడియన్స్ ఫిదా అయ్యారు.

అలాగే రామ్ చరణ్ జోడిగా మగధీర వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో నటించింది. అలాగే వీరిద్దరి కాంబోలో నాయక్, ఎవడు చిత్రాలు వచ్చాయి. ముగ్గురు హీరోలతో కలిసి నటించింది.




