- Telugu News Photo Gallery Cinema photos Actor Fahadh Faasil suffering with wig problem in Pushpa 2 the rule, Details here
Fahadh Faasil: అయ్యో రామ.. ఫాహద్ కి విగ్ ప్రాబ్లమ్.. చివరికి ఏం చేశారో తెలుసా.?
పుష్ప2 సినిమా ప్రమోషన్లలో ఎక్కువగా వినిపించిన పేరు ఫా..ఫా.. యస్.. ఫాహద్ ఫాజిల్. పుష్ప2లో ఆయన యాక్టింగ్ గురించి చాలా స్టేజ్‌ల మీద మాట్లాడుతోంది టీమ్. భన్వర్ సింగ్ షెకావత్‌గా మెప్పించడానికి రెడీ అవుతున్న ఆయన కెరీర్ స్టార్టింగ్‌లో ఇబ్బందులను ఎదుర్కొన్నారా? వాటిని ఎలా ఓవర్‌కమ్ అయ్యారు. భన్వర్ సింగ్ షెకావత్ కేరక్టర్‌లో తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు ఫాహద్‌ఫాజిల్. ఆయన కేరక్టర్ ఫస్ట్ పార్టులో అసలేమీ లేదు. సెకండ్ పార్టులో చూడండి..
Updated on: Dec 05, 2024 | 6:32 PM

పుష్ప2 సినిమా ప్రమోషన్లలో ఎక్కువగా వినిపించిన పేరు ఫా..ఫా.. యస్.. ఫాహద్ ఫాజిల్. పుష్ప2లో ఆయన యాక్టింగ్ గురించి చాలా స్టేజ్‌ల మీద మాట్లాడుతోంది టీమ్.

భన్వర్ సింగ్ షెకావత్‌గా మెప్పించడానికి రెడీ అవుతున్న ఆయన కెరీర్ స్టార్టింగ్‌లో ఇబ్బందులను ఎదుర్కొన్నారా? వాటిని ఎలా ఓవర్‌కమ్ అయ్యారు.

భన్వర్ సింగ్ షెకావత్ కేరక్టర్‌లో తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు ఫాహద్‌ఫాజిల్. ఆయన కేరక్టర్ ఫస్ట్ పార్టులో అసలేమీ లేదు. సెకండ్ పార్టులో చూడండి..

అదిరిపోతుంది అంటూ ఆల్రెడీ కేరళలో ప్రచారం స్టార్ట్ చేసేశారు సతీమణి నజ్రియా. దానికి తోడు పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ అల్లు అర్జున్ ఫాహద్ కేరక్టర్ గురించి చాలా బాగా చెప్పారు.

బన్నీతో సమానంగా నా కేరక్టర్‌ని డిజైన్ చేశారు సుకుమార్. ఆ కేరక్టర్ నచ్చడంతోనే తెలుగు నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పాను. తెలుగు నేర్చుకోవడం కాస్త కష్టమైంది.

అయినా కూడా ఇష్టంగా నేర్చుకున్నా. తప్పకుండా అందరికీ నచ్చుతుందన్నారు ఫాహద్. తెలుగులో హాయిగా నటించిన ఈ స్టార్, కెరీర్ స్టార్టింగ్‌లో తన బట్టతల వల్ల కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందట.

విగ్ పెట్టుకుని నటించమని అడిగేవారట మేకర్స్. కానీ, తనకు అది నచ్చలేదని, అందుకే ప్రాజెక్టులు వదులుకున్నానని చెప్పుకొచ్చారు.

సో.. ఫ్యూచర్‌లో ఎవరైనా ఫాహద్ సినిమా చేయాలంటే విగ్ గురించి ప్రస్తావించకూడదన్నమాట.




