- Telugu News Photo Gallery Cinema photos Heroine Alia Bhatt next movie shooting update after Alpha movie, details here
Alia Bhatt: ఆల్ఫా లేడీ.. ఆలియా ప్లానింగ్ మామూలుగా లేదుగా.!
ఆలియా కంప్లీట్‌గా సింగిల్ జోనర్‌కి ఫిక్సయ్యారా? అని ఈ మధ్య చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని ఇప్పుడు ఆమె సెలక్షన్ చెప్పకనే చెప్పేస్తోంది. రీసెంట్‌గా జిగ్రాతో ప్రూవ్ చేసుకున్న ఆలియా.. నెక్స్ట్ చేస్తున్న సినిమాల కహానీ ఏంటి.? లైఫ్‌ని పక్కాగా ఎలా ప్లాన్ చేసుకోవాలో యంగ్ ఏజ్‌లోనే అర్థం చేసుకున్న హీరోయిన్ ఆలియా. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని, పండంటి బిడ్డకు జన్మనిచ్చి, తనకు ఎంతో ఇష్టమైన యాక్టింగ్‌లో కెరీర్‌ని కంటిన్యూ చేస్తున్నారు ఈ బ్యూటీ.
Updated on: Dec 05, 2024 | 6:08 PM

ఆలియా కంప్లీట్‌గా సింగిల్ జోనర్‌కి ఫిక్సయ్యారా? అని ఈ మధ్య చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని ఇప్పుడు ఆమె సెలక్షన్ చెప్పకనే చెప్పేస్తోంది.

రీసెంట్‌గా జిగ్రాతో ప్రూవ్ చేసుకున్న ఆలియా... నెక్స్ట్ చేస్తున్న సినిమాల కహానీ ఏంటి.? లైఫ్‌ని పక్కాగా ఎలా ప్లాన్ చేసుకోవాలో యంగ్ ఏజ్‌లోనే అర్థం చేసుకున్న హీరోయిన్ ఆలియా.

నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని, పండంటి బిడ్డకు జన్మనిచ్చి, తనకు ఎంతో ఇష్టమైన యాక్టింగ్‌లో కెరీర్‌ని కంటిన్యూ చేస్తున్నారు ఈ బ్యూటీ. రీసెంట్‌గా యాక్షన్ సినిమాలకు షిఫ్ట్ అయ్యారు ఆలియా.

ఇక ఇదే జోనర్‌ని కంటిన్యూ చేస్తారనే ప్రచారం జరిగింది. కంప్లీట్‌గా సింగిల్ జోనర్‌కి పరిమితమవుతారనే మాటలు కొట్టిపారేశారు ఆలియా. ఆమె సెలక్ట్ చేసుకుంటున్న సినిమాలే ఆ విషయాన్ని గట్టిగా చెబుతున్నాయి.

ప్రస్తుతం యష్‌రాజ్ ఫిల్మ్స్ లో ఆల్ఫా మూవీని చేస్తున్నారు ఈ లేడీ. ఈ షూట్‌తో పాటు భర్త రణ్‌బీర్‌తో కలిసి లవ్ అండ్ వార్ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు.

సంజయ్ లీలా భన్సాలీ సెట్స్ లో రెండో సారి అడుగుపెట్టడాన్ని జీవితంలో మర్చిపోలేనంటున్నారు ఆలియా. రణ్‌బీర్‌తో కలిసి ఉండే సమయం పెరిగినందుకు ఆనందంగా ఉందన్నది ఈ బ్యూటీ చెబుతున్న మాట.

ఈ సినిమాలో విక్కీ కౌశల్ కూడా కీ రోల్ చేస్తున్నారు. లవ్ అండ్ వార్ కంప్లీట్ కాగానే ఆలియా ఓ హారర్ కామెడీ సినిమా చేస్తారన్నది నార్త్ న్యూస్. స్త్రీ, స్త్రీ2, ముంజ్యా, బేడియా వంటి సినిమాలకు తెరకెక్కించిన దినేష్ విజన్ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆలియా.

ఛముండా అనే పేరు కూడా ఖరారు చేసినట్టు సమాచారం. రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ లాంటి పక్కా కమర్షియల్ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెర్సటాలిటీని ఇష్టపడుతున్నారంటున్నారు నియర్ అండ్ డియర్స్.




