AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 Box Office Collection: ఇది సార్ పుష్పగాడి బ్రాండ్ అంటే.. తొలిరోజే భారీ వసూళ్లు సాధించిన పుష్ప 2..

అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప 2 సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించింది. పుష్ప 1తో భారీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఇపుడు పుష్ప 2తో మరోసారి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

Pushpa 2 Box Office Collection: ఇది సార్ పుష్పగాడి బ్రాండ్ అంటే.. తొలిరోజే భారీ వసూళ్లు సాధించిన పుష్ప 2..
Pushpa 2
Rajeev Rayala
|

Updated on: Dec 06, 2024 | 9:03 AM

Share

పుష్ప రాజ్ మాస్ జాతర.. ప్రేక్షకులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున పుష్ప 2 సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. ష్ప 2′ చిత్రం బాక్సాఫీస్ వద్ద అపూర్వ విజయం సాధించింది. పుష్ప 1 కు మించి ఈ సినిమా ఉండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పుష్ప 2 ఘనవిజయం సాధించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పుష్ప 2 తొలిరోజే భారీగా వసూళ్లు రాబట్టింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమా  అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. ప్రీమియర్ షోల నుంచే ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మొదటి రోజు పుష్ప ఎంత వసూల్ చేసిందని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా తొలి రోజు వసూళ్లతో పుష్ప 2 అన్ని రికార్డ్స్ ను బద్దలు కొట్టింది.

ఇద్దరు మెగాహీరోలతో సినిమాలు చేసింది.. ఇప్పుడు ఛాన్స్‌లు లేక ఇలా..

అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వందకోట్లు వసూల్ చేసిన ఈ సినిమా.. విడుదల తర్వాత తొలి రోజే భారీగా కలెక్షన్స్ రాబట్టింది. డిసెంబర్ 5న ‘పుష్ప 2’ సినిమా విడుదలైంది. డిసెంబర్ 4న చాలా చోట్ల సినిమా ప్రీమియర్ షోలు వేశారు. ప్రీమియర్ షోల ద్వారా సినిమాకు రూ. 10 కోట్లు రాబట్టింది. డిసెంబర్ 5న ఈ సినిమా ఇండియాలో రూ.165 కోట్లు వసూలు చేసింది. దీని ద్వారా సినిమా మొత్తం వసూళ్లు రూ. 175 కోట్లు వసూల్ చేసింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ లెక్కలు కలుపుకుంటే పుష్ప సినిమా కలెక్షన్ దాదాపు రూ. 250 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది.

అమ్మబాబోయ్..! అస్సలు గుర్తుపట్టలేం గురూ..!! ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియాలో తొలి రోజు రూ. 133 కోట్లు వసూల్ చేసింది. అలాగే బాహుబలి రూ. 121కోట్లు, కేజీఎఫ్ రూ. 116 కోట్లు వసూల్ చేశాయి. ఈ రికార్డ్స్ ను ఇప్పుడు పుష్ప బీట్ చేసింది. పుష్ప2 సినిమాను హైదరాబాద్‌లో 1549 షోలు వేశారు. కర్ణాటకలో దాదాపు 1072 షోలు , చెన్నైలో ఈ చిత్రానికి 244 షోలు వేశారు. కాగా తొలి రోజు వసూళ్లు రూ.175 కోట్లలో తెలుగు వెర్షన్ నుంచి రూ.95.1 కోట్లు, హిందీ నుంచి రూ.67 కోట్లు, తమిళం నుంచి రూ.7 కోట్లు, మలయాళం నుంచి రూ.5 కోట్లు, కన్నడ వెర్షన్ నుంచి రూ.1 కోట్లు రాబట్టిందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై