Tollywood : 14ఏళ్లకే ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పుడు మూడు నిమిషాల పాటకు రూ. 2కోట్లు అందుకుంటుంది..

చాలా మంది హీరోయిన్స్ చిన్నవయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు. అలా చాలా మంది వచ్చారు. యంగ్ హీరోలతో పాటూ తమకంటే వయసులో పెద్దవారి సరసన హీరోయిన్స్ గా సినిమాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు.

Tollywood : 14ఏళ్లకే ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పుడు మూడు నిమిషాల పాటకు రూ. 2కోట్లు అందుకుంటుంది..
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 07, 2024 | 12:22 PM

చాలా మంది హీరోయిన్ చిన్న వయసులోనే హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అలా వచ్చిన వారు ఇప్పుడు సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఒకరు. చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఆమె అందరూ హీరోలకు ఆమె ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. యంగ్ హీరోలందరూ ఆమెనే మొదటి ఛాయిస్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసిన ఆమె పేరే వినిపిస్తుంది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.? సినిమాల్లో హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ తోనూ అదరగొడుతుంది. ఇంతకూ ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.?

Tollywood : నా బాడీ నా ఇష్టం.. నేను ఇలానే ఉంటాను.. తెగేసి చెప్పిన టాలీవుడ్ సింగర్

ఆమె అందం, అభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. క్యూ ఎక్స్ ప్రేక్షన్స్ కు పెట్టింది పేరు ఆ ముద్దుగుమ్మ. ఆమె మరెవరో కాదు లేటెస్ట్ సెన్సేషన్, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల. 2017లో కిస్ అనే కన్నడ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కన్నడలోనే పలు సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఆతర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన రొమాంటిక్ మ్యూజికల్ ఫిల్మ్ పెళ్లి సందడి (2021)తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

కోతి కొమ్మచ్చి ఆడుతున్న ఈ కుర్రాళ్లలో ఓ స్టార్ హీరో ఉన్నాడు.. అమ్మాయిలు వెర్రెక్కిపోతారు అతనంటే.. 

పెళ్లి సందడి విజయం తర్వాత శ్రీలీలకు తెలుగు చిత్రాలలో పలు ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం శ్రీలీల చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. పెళ్లి సందడి తర్వాత ధమకా సినిమాలో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మాన్, గుంటూరు కారం చిత్రాల్లో నటించింది. వీటిల్లో గుంటూరు కారం, భగవంత్ కేసరి బాగా ఆడాయి. పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్‌లో నటిస్తుంది ఈ బ్యూటీ. అలాగే రీసెంట్ గా పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది. ఈ సాంగ్ కోసం రూ.2కోట్లు అందుకుంది ఈ చిన్నది.

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.