Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu : డ్రామా కింగ్.. చేసిందంతా చేసి.. చివరకు చింతిస్తున్నాన్న మోహన్ బాబు..

టీవీ9 రంజిత్‌పై దాడి ఘటనపై మోహన్‌బాబు మరో డ్రామాకు తెరతీశారు. మైక్‌ను మారణాయుధంగా ఉపయోగించి ఇప్పుడు మాట మార్చేశారు. ఈ ఘటనపై చింతిస్తున్నానన్నారు మోహన్‌బాబు. తన ఇంట్లోకి వచ్చి.. తన ఏకాగ్రతకు భంగం కల్గించడంతోనే దాడి చేశానని తెలిపారు. తన ఇంట్లోకి వచ్చింది టీవీ9 రిపోర్టరా..మరెవరైనానా అని తనకు అనుమానం వచ్చిందన్నారు. ఈ ఘటనలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు మోహన్‌బాబు.

Mohan Babu : డ్రామా కింగ్.. చేసిందంతా చేసి.. చివరకు చింతిస్తున్నాన్న మోహన్ బాబు..
Mohan Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 12, 2024 | 7:08 PM

మంచు ఫ్యామిలీ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే మంచి మనోజ్ చేసిన రచ్చ వార్తలో షికారు చేస్తుంది. ఈ క్రమంలోనే మోహన్ బాబు జర్నలిస్టుల పై చేసిన దాడికి తెలుగు రాష్ట్రాల ప్రజలు మండిపడుతున్నారు. విచక్షణ కోల్పోయిన మోహన్ బాబు టీవీ9 రిపోర్టర్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. దాంతో పోలీసులు ఆయన పై కేసు నమోదు చేశారు. పోలీసులు మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆతర్వాత ఆయనను విచారణకు హాజరవ్వాల్సిందిగా పోలీసులు ఆదేశిస్తే.. ఈ లోగా హైబీపీ కారణంగా హాస్పటల్ లో చేరారు మోహన్ బాబు. ఇదిలా ఉంటే తాజాగా మోహన్ బాబు ఓ ఆడియోను విడుదల చేశారు. ఈ ఆడియోలో టీవీ9 రిపోర్టర్ పై చేసిన దాడికి చింతిస్తున్నా అని తెలిపారు.

మోహన్ బాబు మాట్లాడుతూ.. “కుటుంబ సమస్యలో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా మీరే ఆలోచించండి. అందరి ఇళ్లలో కుటుంబ సమస్యలు ఉంటూ ఉంటాయి. నటులు, రాజాకీయ నాయకుల విషయాలు ఉన్నవి లేని చెబుతారు. ఇప్పుడు ప్రజలు కూడా రాజకీయా నాయకులు కూడా ఆలోచించుకోవాలి. టీవీలో వస్తున్నాయి… రాత్రి ఎన్ని గంటలకు గేటు తోసుకొని నా బిడ్డ మనోజ్‌ కుమార్ వచ్చాడు. అది రైటా రాంగా తరువాత మాట్లాడుకుందాం.. పత్రికా సోదరులు నాలుగు రోజుల నుంచి నా ఇంటి ముందు ఉండటం ఎంత వరకు న్యాయం.

నేను బయటకు వెళ్లేప్పుడు చెప్పాను. నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను అని ముందే చెప్పాను. నేను నటుడిగా విద్యాలయ అధినేతి, రాజ్యసభ సభ్యుడిగా ఎలాంటి వాడినో మీ అందరికీ తెలుసు. ఈ రోజు ఈ మీడియా సోదరులు ఎంత కల్పితాలు.. ఎంత నెగిటివిటీ నా గురించి చెబుతున్నారో. రాత్రుళ్లు గేటు పగల గొట్టి పర్మిషన్ లేకుండా ఎవరైనా రావచ్చా.?వాళ్లలో అందరూ మీడియా వారేనా..? లేదా ఎవరైనా నీ మీద పగతో వచ్చారా…? వాళ్లను కొట్టాలని తిట్టాలని నాకు ఎప్పుడూ లేదు..? మైకు తీసుకువచ్చిన నా నోట్లు పెట్టే ప్రయత్నం చేశారు. నా కన్ను పోవాల్సింది… కొంచెం మాత్రమే తగిలింది.. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలింది అన్నారు.. దానికి హృదయపూర్వకంగా బాధపడుతున్నాను.. అతని కుటుంబం ఎంతో బాధపడుతుందో అని నేను ఆలోచిస్తున్నాను. నేను ఎంత ఆవేదనకు గురై ఆసుపత్రిలో జాయిన్ అయ్యానో… ఆలోచించండి. నీతిగా ధర్మంగా న్యాయంగా బతకాలన్నది నా ఆలోచన. నా ఇంటి బయట ఉన్నా వాళ్లను కొట్టి ఉంటే నాది తప్పే. ఇంటి లోపలికి వచ్చినా నా ఏకాగ్రతను, నా మనశ్శాంతిని భగ్నం చేశారు. నా బిడ్డ కూడా చేస్తున్నాడు.. అతనితో పరిష్కరించుకుంటాను… మధ్య వర్తులు అవసరంలేదు. కట్టు బట్టలతో మద్రాసు వెళ్లాను.. నా కష్టార్జితంతో సంపాదించిన 25 శాతం ఫ్రీ ఎడ్యూకేషన్ ఇస్తున్నాను. ఎన్నో చేశాను.. అవన్నీ మర్చిపోయి కొట్టిన ఒక్క విషయమే మాట్లాడుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ అభిమానులారా.. నేను చేసింది తప్పు కొట్టడం తప్పు. కానీ ఏ సందర్భంలో కొట్టాను.. మీ ఇంట్లో దూరితే మీరు ఊరుకుంటారా..? మీడియా అధిపుతుల, వ్యాపార వేత్తలు వాళ్ల ఇళ్లలోకి ఇలాగే వెళితే ఊరుకుంటారా..? నా వల్ల ఓ వ్యక్తిగా గాయమైన దానికి చింతిస్తున్నాను. అసలు అతను జర్నలిస్టా కాదా అని ఆ చీకట్లో నాకు ఎలా తెలుస్తుంది.. చీకట్లో ఏదో మైకు నా మీదకు వచ్చింది దాన్ని లాక్కున్నాను. వాళ్లందరూ నాకు కావాల్సిన వాళ్లే.. టీవీ 9 రజనీకాంత్ అతనితో చాలా సార్లు మాట్లాడాను. అతను తన కొడుకు, సోదరుడి లాంటి వారే. ఏసందర్భంలో కొట్టవలసి వచ్చింది… చాలా మంది జర్నలిస్టులు మాట్లాడారు.. కానీ అవ్వన్ని మీడియలో చెప్పటం లేదు. నా ఇన్‌స్టిట్యూట్ నుంచి చాలా మంది ఐఏఎస్‌లు ఐపీఎస్‌లు అయ్యారు.. వాళ్లకు న్యాయం ధర్మం నేర్పించాను. కానీ ఇక్కడ మాత్రం ఏక పక్షం నిర్ణయం జరుగుతోంది.. ప్రజలారా మీరు చూడండి.. నేను చేసింది న్యాయమా అన్యాయమా.. నా ఇంటి తలుపులు పగలగొట్టి రావటం న్యాయమా అన్యాయమా..? అని ఆడియో రిలీజ్ చేశారు మోహన్ బాబు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.