AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upendra- Aamir Khan: ‘నేను ఉపేంద్రకు పెద్ద అభిమానిని’.. కన్నడ స్టార్‌తో ఆమిర్‌ ఖాన్.. వీడియో

కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర బాలీవుడ్ మిస్టర్ పర్పెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ను ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉపేంద్ర పై ప్రశంసలు కురిపించారు ఆమిర్ ఖాన్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Upendra- Aamir Khan: 'నేను ఉపేంద్రకు పెద్ద అభిమానిని'.. కన్నడ స్టార్‌తో ఆమిర్‌ ఖాన్.. వీడియో
Aamir Khan, Upendra
Basha Shek
|

Updated on: Dec 12, 2024 | 6:35 PM

Share

కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించిన ‘యయూఐ’ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులకు అమితంగా నచ్చేశాయి. దీనికి తోడు చాలా రోజుల తర్వాత ఉపేంద్ర దర్శకత్వం వహిస్తుండడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. యూఐ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. డిసెంబర్ 20న విడుదల కానున్న సినిమా గురించి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాట్లాడారు. ఇక్కడ విశేషమేమిటంటే.. ‘నేను ఉపేంద్రకు పెద్ద అభిమానిని’ అని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. యూఐ సినిమా విడుదలకు ముందు నటుడు, దర్శకుడు ఉపేంద్ర ఆమిర్ ఖాన్‌ను కలిశారు. ఈసందర్భంగా బాలీవుడ్ మిస్టర్ పర్పెక్షనిస్ట్ ‘యూఐ’ ట్రైలర్‌ను మెచ్చుకున్నారు. అలాగే ఉపేంద్ర ప్రతిభపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడీ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

‘నేను ఇప్పుడు ఉపేంద్రతో ఉన్నాను. ఆయన సినిమా డిసెంబర్ 20న విడుదలవుతోంది. నేను ఉప్పీకి పెద్ద అభిమానిని. ట్రైలర్ అద్భుతంగా ఉంది. అది చూసి షాక్ అయ్యాను. నా స్నేహితుడు ఉపేంద్ర చాలా అద్భుతంగా సినిమా రూపొందించారు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. హిందీ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది. చిత్ర బృందానికి ముందే శుభాకాంక్షలు తెలుపుతున్నాను’ అని చెప్పుకొచ్చారు బాలీవుడ్ సూపర్ స్టార్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని అమీర్ ఖాన్ ఆకాంక్షించారు. ఆయన మాటలు విన్న హిందీ ప్రేక్షకుల్లో కూడా ‘యూఐ’ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

ఇవి కూడా చదవండి

ఆమిర్ ఖాన్ తో ఉపేంద్ర.. వీడియో..

ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యూఐ’. ఈ చిత్రంలో రీష్మా నానయ్య, ఇంద్రజిత్ లంకేష్ తదితరులు నటించారు. లహరి ఫిల్మ్స్‌ అండ్‌ వెనుస్‌ ఎంటర్‌టైనర్స్‌ బ్యానర్లపై జి. మనోహరన్, కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఉపేంద్ర యూఐ సినిమా తెలుగు టీజర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీలో వారందరికీ ఉచితంగా రూ.10 లక్షలు.. దరఖాస్తులకు అవకాశం
ఏపీలో వారందరికీ ఉచితంగా రూ.10 లక్షలు.. దరఖాస్తులకు అవకాశం
మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో
మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..