AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soniya Akula: బిగ్ బాస్ బ్యూటీ సోనియా పెళ్లి ముహూర్తం ఫిక్స్.. కాబోయే శ్రీవారితో కలిసి నాగార్జునకు శుభలేఖ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అడుగు పెట్టిన లేడీ కంటెస్టెంట్స్ లో సోనియా ఆకుల ఒకరు. హౌస్ లో మొదట ఆమె ఆట, మాట తీరుని చూసి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనుకున్నారు. ఆఖరి వరకు బిగ్ బాస్ హౌస్‌ లో ఉంటుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు.

Soniya Akula: బిగ్ బాస్ బ్యూటీ సోనియా పెళ్లి ముహూర్తం ఫిక్స్.. కాబోయే శ్రీవారితో కలిసి నాగార్జునకు శుభలేఖ
Bigg Boss 8 Telugu Fame Sonia Akula
Basha Shek
|

Updated on: Dec 11, 2024 | 6:55 PM

Share

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సోనియా ఆకుల ఒకరు. తెలంగాణలోని మంథనికి చెందిన ఈ బ్యూటీ సంచలన దర్శకుడు ఆర్జీవీ తెరకెక్కించిన కొన్ని సినిమాల్లో నటించింది. అయితే పెద్దగా గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిందో అప్పటి నుంచే ఆమె పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. హౌస్ లోనూ తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అయితే నిఖిల్, పృథ్వీల విషయంలో సోనియా ప్రవర్తించిన తీరు చాలా మందికి నచ్చలేదు. ఫలితంగా ఆఖరి వరకు బిగ్ బాస్ హౌస్ లో ఉంటుందనుకున్న ఆమె నాలుగో వారంలోనే బయటకు వచ్చేసింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా సోనియా పేరు బాగా వినిపించింది. పలు ఇంటర్వ్యూల్లో భాగంగా బిగ్ బాస్ షోతో పాటు హోస్ట్ నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేసిందీ ముద్దుగుమ్మ. సినిమాలు, బిగ్ బాస్ షోల సంగతి పక్కన పెడితే సోనియా త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. తన ప్రియుడు యష్‌ పాల్ వీరగోని తో ఏడడుగులు వేసేందుకు రెడీ అయిపోయింది. ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో నవంబర్ 21న వీరి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. తాజాగా ఈ ప్రేమ పక్షల పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. డిసెంబర్‌ 21న మధ్యాహ్నం 3.40 గంటలకు తమ వివాహం జరగనుందని తెలియజేస్తూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో రిలీజ్‌ చేసింది సోనియా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పలువురు బుల్లితెర ప్రముఖులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్, అభిమానులు, నెటిజన్లు సోనియాకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

తాజాగా సోనియా తనకు కాబోయే శ్రీవారిని తీసుకొని హీరో బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జునను కలిసింది. తమ పెళ్లి శుభలేఖ అందజేసి తప్పకుండా వివాహానికి రావాలంటూ ఆహ్వానించారు సోనియా- యశ్. నాగార్జున కూడా తప్పకుండా పెళ్లికి వస్తానంటూ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వీడియోని సోనియాకి కాబోయే భర్త యష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘మా జీవితంలో స్పెషల్ డే అయిన మా వివాహానికి తప్పకుండా రావాలని నాగార్జున గారిని ఆహ్వానించాం’ అంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు యష్.

నాగార్జునతో బిగ్ బాస్ సోనియా ఆకుల.. వీడియో..

సోనియా వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి