దివంగత ఎన్టీఆర్‌తో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. నందమూరి ఫ్యామిలీ కాదండోయ్

ఈ ఫొటోలో దివంగత ఎన్టీఆర్ తో ఉన్న పిల్లాడిని గుర్తు పట్టారా? ఆ అబ్బాయి ఒక స్టార్ నటుడి కుమారుడు. ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోగా వెలుగొందుతున్నాడు. చాలామంది అనుకుంటున్నట్లు అతని నందమూరి అబ్బాయ్ మాత్రం కాదండోయ్.

దివంగత ఎన్టీఆర్‌తో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. నందమూరి ఫ్యామిలీ కాదండోయ్
NT Rama Rao
Follow us
Basha Shek

|

Updated on: Dec 09, 2024 | 9:42 AM

దివంగత నందమూరి హీరో ఎన్టీఆర్ తో ఉన్న ఈ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో. స్టార్ నటుడి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితేనేం అతి తక్కువ రోజుల్లోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక టాలీవుడ్ లో అందరి హీరోలతో ఫ్రెండ్లీగా ఉండే కథానాయకుల్లో ఇతను ముందుంటాడు. అందుకే సోషల్ మీడియాలోనూ ఈ హీరోకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆ మధ్యన ఈ హీరోకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. భార్యతో విడాకులు తీసుకున్నారు. సినిమాలు సరిగా ఆడలేకపోయాయి. దీంతో చాలా రోజుల పాటు సైలెంట్ గా ఉండిపోయాడు. అయితే గోడకు కొట్టిన బంతిలా మళ్లీ తిరిగొచ్చాడు. మనసుకు నచ్చిన అమ్మాయితో కలిసి మళ్లీ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. అలాగే వరుసగా సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇక అంతా బాగుంటుందనుకుంటున్న తరుణంలో ఈ హీరో ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయి. తండ్రి తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడని వార్తలు వినిపించసాగాయి. ఆస్పత్రిలో చేరి చికిత్స కూడా తీసుకున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ పిల్లాడు మరెవరో కాదు మంచు వారబ్బాయి మంచు మనోజ్. ఇది అతని చిన్ననాటి ఫొటో.

దివంగత ఎన్టీఆర్ తో కలిసి మేజర్ చంద్రకాంత్ అనే సినిమాలో నటించారు మోహన్ బాబు. ఆ సినిమా షూట్ లోనే మంచు మనోజ్ ఇలా ఎన్టీఆర్ తో సరదాగా కలిసి ఫొటోలు దిగాడు. ఇక టాలీవుడ్ లో క్రమశిక్షణకు మారుపేరుగా మంచు ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇది మంచు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇక ఆదివారం ఉదయం సాయంత్రం మనోజ్ గాయాలతో ఆస్పత్రిలో చేరడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు.

ఇవి కూడా చదవండి

భైరవం సినిమాలో మనోజ్..

View this post on Instagram

A post shared by Manoj Manchu (@manojkmanchu)

ప్రస్తుతం మంచు విష్ణు పలు సినిమాల్లో నటిస్తూ బిజి బిజీగా ఉంటున్నాడు. తేజ సజ్జా హీరోగా నటిస్తోన్న మిరాజ్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు మనోజ్. అలాగే వాట్ ది ఫిష్, భైరవం వంటి క్రేజీ ప్రాజెక్టులు కూడా మనోజ్ చేతిలో ఉన్నాయి.

భార్య, కుమారుడితో మంచు మనోజ్..

View this post on Instagram

A post shared by Manoj Manchu (@manojkmanchu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.