Mohan Babu: మోహన్ బాబు దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు.. అసలు విషయమేమిటంటే?

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. గతంలో మంచు విష్ణు, మనోజ్ ల మధ్య గొడవలు తీవ్ర చర్చనీయాంశమయయాయి. తాజాగా మోహన్ బాబు, మనోజ్ పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.

Mohan Babu: మోహన్ బాబు దాడి చేశారని మనోజ్ ఫిర్యాదు.. అసలు విషయమేమిటంటే?
Manchu Manoj, Mohan Babu
Follow us
Basha Shek

|

Updated on: Dec 08, 2024 | 12:34 PM

టాలీవుడ్ సీనియ‌ర్ నటుడు మంచు మోహ‌న్ బాబుపై పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు అయ్యింది.తనతో పాటు తన భార్య‌పై మోహ‌న్ బాబు దాడిచేశాడ‌ని స్వయంగా ఆయన కొడుకు మంచు మనోజ్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. గాయాల‌తోనే పోలీస స్టేషన్ కు వెళ్లిన మ‌నోజ్ మోహ‌న్ బాబుపై ఫిర్యాదును అందించాడు.  ఈ మేరకు మోహన్ బాబుపై పహడి షర్రిఫ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మరోవైపు మనోజే తనపై దాడి చేశాడని మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్తులు, స్కూల్ వ్య‌వ‌హారంపై ఈ గొడవ‌లు జ‌రిగిన‌ట్లు తెలుస్తుంది.  కాగా కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో  తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్యన మంచు విష్ణు, మనోజ్ ల మధ్య పెద్ద గొడవే జరిగింది.  మంచు విష్ణు.. మనోజ్ ఇంటికి వచ్చి మరీ కొడతానని వార్నింగ్ ఇచ్చాడు. ఈ కారణంగానే మనోజ్ పెళ్లిలో ఎక్కువగా కనిపించలేదు మంచు విష్ణు.  ఇప్పుడు ఏకంగా తండ్రీ కొడుకులు గొడవ పడడం సంచలనంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబును క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకుంటారు. అలాంటిది వారి కుటుంబంలోనే ఇలాంటి గొడవలు రేగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అసత్యాలను ప్రచారం చేయవద్దు..

అయితే ఈ వార్తలను మోహన్ బాబు ఖండించారు.  ఈ వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. ‘మోహన్ బాబు , మంచుమనోజ్ పరస్పర ఫిర్యాదులు చెసుకున్నారనే వార్తల్లో నిజం‌ లేదు. మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కధనాలను కొన్ని మీడియా చానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. ఎవిడెన్స్ లు లేకుండా అసత్య ప్రచారాలను చేయకండి’ అని చెప్పుకొచ్చారు.

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి