IND vs AUS: మిడిల్ ఆర్డర్‌లోనూ మారని రోహిత్ తీరు.. ‘రిటైరవ్వడం బెటర్’ అంటోన్న క్రికెట్ ఫ్యాన్స్

అడిలైడ్ టెస్టులో బ్యాటింగ్ ఆర్డర్ మారినప్పటికీ రోహిత్ శర్మ ఫామ్ మెరుగుపడలేదు. మిడిలార్డర్‌లో ఆడినప్పటికీ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సింగిల్ డిజిట్ దాటలేకపోయాడు. గత రెండేళ్లుగా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న రోహిత్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు.

IND vs AUS: మిడిల్ ఆర్డర్‌లోనూ మారని రోహిత్ తీరు.. 'రిటైరవ్వడం బెటర్' అంటోన్న క్రికెట్ ఫ్యాన్స్
Rohit Sharma
Follow us
Basha Shek

|

Updated on: Dec 07, 2024 | 8:43 PM

అడిలైడ్ టెస్టులో ఓపెనర్ మారాడు. దీంతో కెప్టె్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మారిపోయింది. అయితే బ్యాటింగ్ ఆర్డర్ మారినప్పటికీ రోహిత్ ఆటతీరు మాత్రం మారలేదు. 7 ఏళ్ల తర్వాత మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సింగిల్ డిజిట్ ను కూడా దాటలేకపోయాడు. కొడుకు పుట్టడంతో పెర్త్ టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ అడిలైడ్ టెస్టులో బరిలోకి దిగడు. కనీసం ఈ టెస్టులోనైనా లయ అందుకుంటాడని ఆశించిన క్రికెట్ అభిమానులను రోహిత్ మళ్లీ తీవ్రంగా నిరాశ పరిచాడు. అడిలైడ్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 6వ స్థానంలో బ్యాటింగ్ చేసిన రోహిత్ 23 బంతులు ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేసి స్కాట్ బోలాండ్ చేతిలో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 6వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ శర్మ 15 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 6 పరుగులు సాధించగలిగాడు. అంటే ఈ రెండు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ 9 పరుగులు మాత్రమే చేశాడు.

నిజానికి రోహిత్ శర్మ చాలా కాలంగా టెస్టు క్రికెట్‌లో పేలవమైన ఫామ్‌తో బాధపడుతున్నాడు. రోహిత్ గత రెండేళ్లలో ఆడిన 38 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 33 సగటుతో 1226 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా గత 11 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ ఫామ్ చాలా పేలవంగా ఉంది. గత 11 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ 12.36 సగటుతో 136 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మూడోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆడుతున్న రోహిత్ 10 సార్లు రెండంకెల స్కోరును అందుకోలేకపోయాడు.

ఇవి కూడా చదవండి

2023-25 ​​ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో రోహిత్ శర్మ సగటు 32.15 అతని చెత్త ప్రదర్శనకు అద్దం పడుతుంది. అంతకుముందు, 2019-21 టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో రోహిత్ శర్మ 60.77 సగటుతో 1094 పరుగులు చేశాడు హిట్ మ్యాన్. 2021-23 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో 42.11 సగటుతో 758 పరుగులు చేశాడు. అయితే ఈసారి మాత్రం రోహిత్ మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే టెస్టు జట్టు నుంచి రోహిత్ కు ఉద్వాసన తప్పదంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

కెప్టెన్సీలోనూ…

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..