Tollywood:ఇన్ స్టాలో భర్త పేరు, ఫొటోలు డిలీట్.. విడాకులపై హింట్ ఇచ్చేసిన టాలీవుడ్ హీరోయిన్! గుర్తు పట్టారా?

సినిమా ఇండస్ట్రీలో మరో జంట విడిపోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మధ్యన విడాకులు తీసుకున్న పలువరు ప్రముఖులు మొదట సోషల్ మీడియాలోనే హింట్లు ఇస్తున్నారు. తమ పేరులో ఉన్న భర్త/భార్య పేర్లను తొలగిస్తున్నారు. తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ తన ఇన్ స్టా ఖాతాలో తన భర్త పేరును తొలగించింది.

Tollywood:ఇన్ స్టాలో భర్త పేరు, ఫొటోలు డిలీట్.. విడాకులపై హింట్ ఇచ్చేసిన టాలీవుడ్ హీరోయిన్! గుర్తు పట్టారా?
Actress Niti Taylor
Follow us
Basha Shek

|

Updated on: Dec 06, 2024 | 5:53 PM

పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ ను గుర్తు పట్టారా? ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించించి ముచ్చటగా మూడు సినిమాలే. కానీ తన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. అయితే ఎందుకోగానీ ఇక్కడ కొనసాగలేకపోయింది. బాలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడ క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు వెబ్ షోలతో ఆడియెన్స్ ను అలరించింది. అయితే ఎప్పుడు సినిమాలు, సీరియల్స్ తో వార్తల్లో నిలిచే ఈ అందాల తార ఇప్పుడు సినిమాయేతర విషయాలతో ట్రెండ్ అవుతోంది. తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్ కు ప్రధాన కారణం తన ఇన్ స్టా ఖాతా నుంచి భర్త పేరును తొలగించడమే. ప్రస్తుతం బాలీవుడ్ బుల్లితెరపై చర్చనీయాంశంగా మారిన ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు మేం వయసుకు వచ్చాం సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ కు చేరువైన నీతి టేలర్. సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే పరీక్షిత్ భవా అనే ఆర్మీ ఆఫీసర్‌ను పెళ్లి చేసుకుందీ అందాల తార. కొవిడ్ సమయం కావడంతో 2020లో వీరి వివాహం సింపుల్ గా జరిగింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లయిన వెంటనే తన పేరును నీతి భవాగా మార్చుకుంది. మూడేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నీతి టేలర్ తన భర్తకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

తాజాగా తన పేరులోంచి భవాను తొలగించి మళ్లీ నీతి టేలర్ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకుంది. దీంతో విడాకులపై హింట్ ఇచ్చేసిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంతో ? అబద్ధమెంతో? అనేది తెలియనప్పటికీ నీతి పేరు మార్చుకోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.

ఇవి కూడా చదవండి

నీతి టేలర్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Niti Taylor (@nititaylor)

కాగా ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది నీతి టేలర్. ఆ తర్వాత పెళ్లిపుస్తకం, లవ్ డాట్‌కామ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్ఇ ‘కైసీ యే యారియాన్’ సీరిస్ తో బాగా ఫేమస్ అయిపోయింది. అంతేకాదు ప్యార్ కా బంధన్ , ఝలక్ దిఖ్ లాజా, బిగ్ బాస్ వంటి ఫేమస్ టీవీ షోలు, రియాలిటీ షోల్లోనూ సందడి చేసిందీ అందాల తార.

View this post on Instagram

A post shared by Niti Taylor (@nititaylor)

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీ చైతన్య కాలేజీ నిర్వాకం.. ఫీజు కట్టలేదని విద్యార్థి గెంటివేత!
శ్రీ చైతన్య కాలేజీ నిర్వాకం.. ఫీజు కట్టలేదని విద్యార్థి గెంటివేత!
తెల్లారుజామున అదే పనిగా కుక్కల అరుపులు.. ఏంటా అని చూడగా
తెల్లారుజామున అదే పనిగా కుక్కల అరుపులు.. ఏంటా అని చూడగా
IPL 2025 లో ఆర్సీబీ ఆశలన్ని ఆ ముగ్గురిపైనే..!
IPL 2025 లో ఆర్సీబీ ఆశలన్ని ఆ ముగ్గురిపైనే..!
రుద్రాణి చేతికి బ్రహ్మాస్త్రం.. రాజ్ చెంప పగలకొట్టిన అపర్ణ..
రుద్రాణి చేతికి బ్రహ్మాస్త్రం.. రాజ్ చెంప పగలకొట్టిన అపర్ణ..
వెంకటేష్‌తో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
వెంకటేష్‌తో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
'అమ్మానాన్నలు కాబోతున్నామోచ్‌'.. శుభవార్త చెప్పిన కిరణ్ అబ్బవరం
'అమ్మానాన్నలు కాబోతున్నామోచ్‌'.. శుభవార్త చెప్పిన కిరణ్ అబ్బవరం
చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..
చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..
సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డు.. ఎంతంటే?
సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డు.. ఎంతంటే?
స్టార్ హీరోలతో చేసింది.. ఇప్పుడు ఆఫర్స్ రాక ఇలా..
స్టార్ హీరోలతో చేసింది.. ఇప్పుడు ఆఫర్స్ రాక ఇలా..
నిండు చూలాలి కడుపుపై కూర్చుని.. కాళ్లతో తొక్కి.. ఓ భర్త కిరాతకం
నిండు చూలాలి కడుపుపై కూర్చుని.. కాళ్లతో తొక్కి.. ఓ భర్త కిరాతకం