- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna shares Pushpa 2 Movie shooting and promotion photos
Pushpa 2: థియేటర్లలోకి పుష్ప 2.. స్వీట్ మెమోరీస్ షేర్ చేసిన రష్మిక.. ఫొటోస్ ఇదిగో
అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న పుష్ప 2 గురువారం (డిసెంబర్ 05) విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 12వేలకు పైగా స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శితమయ్యింది.
Updated on: Dec 05, 2024 | 2:31 PM

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన 'పుష్ప 2' గురువారం (డిసెంబర్ 05) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలిరోజు ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.

కాగా పుష్ప 2 సినిమా షూటింగ్ దాదాపు మూడు సంవత్సరాల పాటు జరిగింది. ఇక రెండు సినిమాలకు కలిపి మొత్తం ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది.

ఈ క్రమంలో ఇన్ని సంవత్సరాలుగా 'పుష్ప' సినిమా సెట్ తన ఇల్లు అని చెప్పిన రష్మిక మందన్న టీమ్ తో కలిసున్న మధుర క్షణాలను గుర్తుకు చేసుకుంది.

దర్శకుడు సుకుమార్, నటుడు అల్లు అర్జున్, కెమెరామెన్, ఇతర టీమ్ సభ్యులతో కలిసి వివిధ సందర్భాల్లో దిగన ఫొటోలను రష్మిక మందన్నా పంచుకుంది.

సినిమా షూటింగ్ సమయంలో తీసిన చిత్రాలతో పాటు సినిమా ప్రమోషన్ సమయంలో తీసిన చిత్రాలను కూడా రష్మిక మందన్న షేర్ చేసింది.

కాగా పుష్ప 3’ సినిమా కూడా రాబోతుందని తెలుస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ కూడా ఉంటాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.





























