Jani Master: జానీ మాస్టర్‌కు కొరియోగ్రాఫర్‌గా అవకాశమిచ్చిన ఆ స్టార్ హీరో! డ్యాన్స్ వీడియో వైరల్
తన దగ్గర పనిచేసే లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే అభియోగాలతో అరెస్ట్ అయ్యాడు జానీ మాస్టర్. సుమారు నెల రోజుల పాటు జైలు జీవితం గడిపిన అతను బెయిల్ పై బయటకు వచ్చాడు.
లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో 37 రోజుల పాటు జైలులో ఉన్న జానీ మాస్టర్ బెయిల్ పై బయటకు వచ్చాడు. జైలు నుంచి వచ్చాక ఎక్కువగా తన ఫ్యామిలీతోనే గడిపాడీ స్టార్ కొరియోగ్రాఫర్. బయట ఎలాంటి కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనలేదు. అయితే ఆ మధ్యన ఓ సినిమా ఈవెంట్ కు హాజరయ్యాడు జాని. జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్ ) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యాడు. కాగా తన ఎనర్జిటిక్ డ్యాన్స్ తో నేషనల్ అవార్డు అందుకోవాల్సిన జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలతో పూర్తిగా డీలా పడ్డాడు. కొరియోగ్రాఫర్ గా అవకాశాలు కూడా కరువయ్యాయి. నిజం చెప్పాలంటే గురువారం (డిసెంబర్ 05)న రిలీజైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప -2లో జానీ మాస్టర్ స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రాఫీ చేయాల్సి ఉంది. అయితే లైంగిక ఆరోపణలు రావడంతో ఆ సదావకాశాన్ని కోల్పోయాడు జానీ. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న జానీ ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడీ ట్యాలెంటెడ్ కొరియోగ్రాఫర కు ఓ స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోన్న స్టార్ హీరోల్లో వరుణ్ ధావన్ ఒకడు. ప్రస్తుతం బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తున్నాడీ క్రేజీ హీరో. ఇందులో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తేరి సినిమాకు బేబీ జాన్ అఫీషియల్ హిందీ రీమేక్. ఇప్పుడు ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కు అవకాశం వచ్చిందని టాక. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ మళ్లీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. అది కూడా బేబీ జాన్ పాటకే కావడం గమనార్హం. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండడం విశేషం.
జానీ మాస్టర్ డ్యాన్స్ వీడియో..
The prep behind the PATAKA song of the year 💃🕺💥
Groove to the energetic beats of #NainMatakka and tag me 🤩#BabyJohn @MuradKhetani @priyaatlee #JyotiDeshpande @Atlee_dir @Varun_dvn @KeerthyOfficial #WamiqaGabbi @bindasbhidu @rajpalofficial @kalees_dir @diljitdosanjh… pic.twitter.com/JMHrYbuT0T
— Jani Master (@AlwaysJani) December 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..