Nani: శబరిమల అయ్యప్ప సన్నిధిలో సామాన్యుడిలా న్యాచురల్ స్టార్ నాని.. ఫొటోస్ వైరల్

న్యాచురల్ స్టార్ నానికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. తరచూ అయ్యప్ప మాలను ధరిస్తుంటాడు. అలా ఈసారి కూడా అయ్యప్ప దీక్షను స్వీకరించాడు. దీక్షలోనే ఇటీవల దుబాయ్ కు వెళ్లి ఐఫా ఉత్సవాల్లో పాల్గొన్నాడు. ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు.

Nani: శబరిమల అయ్యప్ప సన్నిధిలో సామాన్యుడిలా న్యాచురల్ స్టార్ నాని.. ఫొటోస్ వైరల్
Actor Nani
Follow us
Basha Shek

|

Updated on: Dec 05, 2024 | 10:03 AM

అయ్యప్ప భక్తులు ఎంతో నియమ నిష్టలతో మండల దీక్షను స్వీకరిస్తారు. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఏటా అయ్యప్ప మాలను ధరిస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, న్యాచురల్ స్టార్ నాని అలాగే నితిన్ ఏటా అయ్యప్ప మాలను వేసుకుంటారు. అలాగే శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. అలా ఇప్పుడు నాని శబరిమల యాత్రకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా ఒక సామాన్యుడిలా తోటి అయ్యప్ప భక్తులతో కలిసి పోయి కనిపించాడు నాని. వీటిని చూసిన నెటిజన్లు న్యాచురల్ స్టార్ సింప్లిసిటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ ఫొటోలు ఇప్పటివి కావని తెలుస్తోంది. గతంలో పలు సార్లు శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లాడు నాని. ఆ సందర్భంలో దిగిన ఫొటోలను మళ్లీ ఇప్పుడు నెటిజన్లు వైరల్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోల్లో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ సభ్యులు ఆనంద్ సాయి కూడా నానితో కనిపించాడు. గూగుల్ లెన్స్ ద్వారా సెర్చ్ చేయగా.. ఇవి సుమారు రెండేళ్ల క్రితం దిగిన ఫొటోలని తెలుస్తోంది. ఎప్పుడయితేనేం..ఇలా భక్తుల్లో సామాన్యుడిలా కలిసిపోయిన నాని సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు నాని. గతేడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ప్రస్తుతం శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్ లో హిట్ 3 సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే ఏడాది మేడే సందర్బంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సైమా అవార్డుల ప్రదానోత్సవంలో నాని..

ఇకదసరా లాంటి బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతోనే నాని మరో సినిమా చేస్తున్నాడు. దీనికి ది ప్యారడైజ్ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఇందులో ఓ సీనియర్ స్టార్ హీరో కూడా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.