AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: కేంద్ర మంత్రులతో కలిసి ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా చూసిన ప్రధాని మోడీ.. ఏమన్నారంటే?

గోద్రా మారణకాండ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'ది సబర్మతి రిపోర్ట్'. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం (డిసెంబర్ 2) ఈ చిత్రాన్నిపలువురు కేంద్ర మంత్రులతో కలిసి వీక్షించారు. అనంతరం సినిమాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

PM Modi: కేంద్ర మంత్రులతో కలిసి 'ది సబర్మతి రిపోర్ట్' సినిమా చూసిన ప్రధాని మోడీ.. ఏమన్నారంటే?
PM Narendra Modi
Basha Shek
|

Updated on: Dec 02, 2024 | 9:35 PM

Share

విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వీక్షించారు. సోమవారం (డిసెంబర్ 2) పార్లమెంట్ హౌస్‌లోని బాలయోగి హాల్‌లో మోడీ ఈ సినిమాను వీక్షించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, పార్లమెంటేరియన్లు, చిత్రబృందం ఈ స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరయ్యారు. సినిమా చూసిన అనంతరం నరేంద్ర మోడీ తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. ధీరజ్ సర్నా దర్శకత్వం తెరకెక్కించిన ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను ఏక్తా కపూర్, శోభా కపూర్, అమూల్ వి. మోహన్, అన్షుల్ మోహన్ సంయుక్తంగా నిర్మించారు. విక్రాంత్ మాస్సే, రాశి ఖన్నా, రిధి డోగ్రా, బర్కా సింగ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. నవంబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పలువురి ప్రశంసలు అందుకుంది. తాజాగా ప్రధాని మోడీ స్వయంగా ఈ సినిమాను చూసి చిత్ర బృందం కృషిని మెచ్చుకున్నారు.

ది సబర్మతి రిపోర్ట్ సినిమా చూసిన తర్వాత నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ‘ఎన్డీయే ఎంపీలతో కలిసి సబర్మతి రిపోర్ట్ సినిమా చూశారు. చిత్రబృందం చేసిన కృషిని అభినందిస్తున్నాను’ అని వీటికి క్యాప్షన్ ఇచ్చారు మోడీ. కాగా స్వయంగా ప్రధాని నుంచి ఈ ప్రశంసలు అందుకోవడం పట్ల ‘ది సబర్మతి రిపోర్ట్’ బృందం హర్షం వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మంత్రి జేపీ నడ్డా కూడా సినిమాను వీక్షించారు. విక్రాంత్ మాస్సే, ఏక్తా కపూర్, రిద్ధి డోగ్రా, దర్శకుడు ధీరజ్ వంటి చిత్రబృందం సభ్యులు కూడా మోడీతో కలిసి కూర్చుని సినిమా చూశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విక్రాంత్ మాస్సే ‘ఇది చాలా భిన్నమైన అనుభవం. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ అనుభవాన్ని మాటల్లో చెప్పలేం. ప్రధాని మోదీతో కలిసి కూర్చుని సినిమా చూడడం నా కెరీర్‌లో అత్యంత మధురమైన క్షణాలు’ అని ఉప్పొంగిపోయాడు.

ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్..

కాగా ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమా విడుదలైనప్పుడు కూడా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ‘నిజం బయటకు రావడం చాలా బాగుంది. అందులోనూ సామాన్యులు చూసి అర్థం చేసుకోగలిగే నిజం మీడియా ద్వారా బయటకు వస్తోంది. తప్పుడు ప్రకటనలు, కథనాలు కొంత కాలం మాత్రమే మనుగడలో ఉంటాయని, ఎప్పుడో ఒకప్పుడు నిజం బయటకు రావాల్సి ఉంటుంది’ అని అందులో పేర్కొన్నారు. 2002 ఫిబ్రవరి 27న జరిగిన గోద్రా రైలు దుర్ఘటన ఘటన ఆధారంగా ‘ది సబర్మతి రిపోర్ట్‌’ చిత్రాన్ని రూపొందించారు. చాలా రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారు.

గతంలోనూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.