Tollywood: బ్యాడ్మింటన్, రేసింగ్ పోటీల్లో విజేత.. కట్ చేస్తే..టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. గుర్తు పట్టారా?
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న వారిలో చాలా మంది కెరీర్ ప్రారంభంలో డాక్టరో, ఇంజినీరో అవుదామని కలలు కన్నవాళ్లే. అయితే నటనపై మక్కువతో సినిమాల్లోకి అడుగు పెట్టారు. తమ అందం, అభినయంతో సక్సెస్ అయ్యారు. ఈ హీరోయిన్ కూడా సరిగ్గా ఈ జాబితాకే చెందుతుంది.
మనలాగే చాలామంది హీరోయిన్లు కూడా కెరీర్ ప్రారంభంలో డాక్టర్ లేదా ఇంజినీర్ అవుదామనుకున్న వాళ్లే. అయితే అనూహ్యంగా సినిమాల్లోకి అడుగు పెట్టి సక్సెస్ అయ్యారు. పై ఫొటోలో ఉన్న టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. అయితే ఈ ముద్దుగుమ్మ డాక్టర్ లేదా ఇంజనీర్ అవ్వాలనుకోలేదు. ఏకంగా ఫార్ములా కార్ రేసింగ్ లో రయ్ రయ్ మని దూసుకెళ్లాలనుకుంది. అందుకు తగ్గట్టుగానే శిక్షణ పొందింది. పలు పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. కేవలం రేసింగులోనే కాదు బ్యాడ్మింటన పోటల్లోనూ పాల్గొంది. అయితే అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇలా మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా పేరు తెచ్చుకున్న ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు నివేతా పేతురాజ్. తమిళనాడులోని మధురై లో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి పదేళ్లు దుబాయిలో ఉన్నత చదువులు అభ్యసించింది. ఆ తర్వాత మిస్ ఇండియా యూఏఈ పోటీల్లో విజేతగా నిలిచింది. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లోనూ పాల్గొంది.
మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది నివేద. ఆ తర్వాత టిక్ టిక్ టిక్, చిత్రల హరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠ పురం, రెడ్, పాగల్, దాస్ కా దమ్కీ తదితర హిట్ సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తమిళ భాషలోనూ సినిమాలు చేసి అక్కడి ఆడియెన్స్ ను అలరించింది. కాగా ఇప్పటికీ తన తమ్ముడితో కలిసి ఫార్ములా కారు రేసింగ్ పోటీల్లో పాల్గొంటుంది నివేద. అలాగే బ్యాడ్మింటిన్ పోటీల్లోనూ తనదైన ప్రతిభ చూపిస్తూ ఉంటోంది. వీటికి సంబంధించిన ఫొటోలను అప్పుడప్పడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ మల్టీ ట్యాలెంట్ ను నెటిజన్లు కొనియాడుతున్నారు.
బ్యాడ్మింటన్ పోటీల్లో టాలీవుడ్ హీరోయిన్..
View this post on Instagram
సినిమాలతో పాటు పలు వెబ్ సిరీసుల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది నివేద పేతురాజ్. చివరిగా ఆమె నటించిన పరువు వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
తమ్ముడితో కలిసి రేసింగ్ పోటీల్లో నివేదా పేతు రాజ్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.