Pushpa 2: హైదరాబాద్‌లో పుష్ఫ గాడి వైల్డ్ ఫైర్ జాతర.. హోస్ట్ ఎవరో తెలుసా?

పుష్ప 2 రిలీజ్ కు మరో 5 రోజులే మిగిలి ఉన్నాయి. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడ్ అందుకున్నాయి. ఇందులో భాగంగా సోమవారం (డిసెంబర్ 02) హైదరాబాద్ లో వైల్డ్ ఫైర్ జాతర పేరుతో స్పెషల్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

Pushpa 2: హైదరాబాద్‌లో పుష్ఫ గాడి వైల్డ్ ఫైర్ జాతర.. హోస్ట్ ఎవరో తెలుసా?
Pushpa 2
Follow us
Basha Shek

|

Updated on: Nov 30, 2024 | 9:31 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 సినిమాపై అంచనాలు ఆకాశనంటుతున్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ సినిమాపై హైప్ ను క్రియేట్ చేశాయి. అందుకు తగ్గట్టే డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. విడుదలకు కేవలం 5 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మరింత స్పీడ్ అందుకున్నాయి. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆ రేంజ్ కు తగ్గట్టుగానే ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పట్నా, చెన్నై, కొచ్చి, ముంబైలో పుష్ప 2 ప్రమోషన్స్ ఈవెంట్స్ నిర్వహించాగా అభిమానుల నుంచి ఊహించని స్పందన వస్తోంది. ఇక ఆదివారం (డిసెంబర్ 01) హైదరాబాద్ లో జరగాల్సిన పుష్ప 2 ఈవెంట్ సోమవారం (డిసెంబర్ 02) కు వాయిదా పడింది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో పుష్ప 2 ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ లో పుష్ప గాడి వైల్డ్ ఫైర్ జాతర పేరుతో నిర్వహించే ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్, రష్మికతో సహా చిత్ర బృందమంతా హాజరు కానుంది. ఈ ప్రమోషన్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు కూడా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప 2 ఈవెంట్ కు ముందు స్టార్ యాంకర్ సుమ షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె 🖐️🪓🔥 ఎమోజీలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీంతో సోమవారం హైదరాబాద్ లో జరిగే ‘పుష్ప 2’ ఈవెంట్ కు సుమనే హోస్ట్ చేయనుందని ఇన్ డైరెక్టుగా హింట్ ఇచ్చింది.

మొత్తానికి హైదరాబాద్ లో జరిగే పుష్ప 2ఈవెంట్ కు హోస్ట్ గా స్టార్ యాంకర్ సుమనే అని ఖరారైంది. దీంతో ఈ ఈవెంట్ కు మరో స్పెషల్ అట్రాక్షన్ జోడైంది. కాగా హైదరాబాద్ ఈవెంట్ తర్వాత ముంబై, కోల్ కత్తా లలో పుష్ప 2 ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

సుమ కనకాల ట్వీట్..

పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్నతో పాటు మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్‌లో బ్యానర్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.