AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya- Sobhita: ‘శోభితను మొదట అక్కడే కలిశాను.. పెళ్లి రోజు కోసం వెయిట్ చేస్తున్నా’: నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహానికి మరికొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా శుక్రవారం (నవంబర్ 29) కాబోయే వధూవరులిద్దరికీ మంగళ స్నానాలు చేయించారు.

Naga Chaitanya- Sobhita: 'శోభితను మొదట అక్కడే కలిశాను.. పెళ్లి రోజు కోసం వెయిట్ చేస్తున్నా': నాగ చైతన్య
Naga Chaitanya, Sobhita Dhulipala
Basha Shek
|

Updated on: Nov 29, 2024 | 7:05 PM

Share

టాలీవుడ్ హీరో, హీరోయిన్లు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం (నవంబర్ 29) ఇరు కుటుంబాల ఇంట్లో హల్దీ వేడుక కూడా అట్టహాసంగా జరిగింది. నాగ చైతన్యకి ఇది రెండో పెళ్లి కాగా శోభితకు మొదటి పెళ్లి. అయితే ఈ కాబోయే వధూవరులు మొదటి ఎప్పుడు కలుసుకున్నారు? వారి పరిచయం ప్రేమగా ఎలా మారింది? తదితర విషయాలపై ఇప్పటికే చాలా రూమర్లు నడిచాయి. అయితే ఈ ఊహాగానాలకు తెరదించాడు నాగ చైతన్య. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతను.. తాను, శోభిత ఎలా కలిశాం, ఎప్పుడు, ఎక్కడ కలిశాం అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు విడాకులకు ముందు వారిద్దరికీ పరిచయం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. 2023 ప్రారంభంలో శోభితను మొదటిసారి కలిశానని చెప్పుకొచ్చాడీ అక్కినేని హీరో. కాగా గతంలో నాగ చైతన్య ‘ధూత’ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. ఇది అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. అదే సమయంలో శోభిత నటించిన ‘మేడ్ ఇన్ హెవెన్’ అనే అమెజాన్ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ధూత, మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్‌లు ఒకే సమయంలో విడుదలయ్యాయి. ఇందుకోసం అమెజాన్ ప్రైమ్ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలోనే నాగ చైతన్య, శోభిత మొదటిసారిగా కలుసుకున్నారట. ఆ తర్వాత పరిచయం క్రమంగా స్నేహంగా మారిందట. ఆపై ప్రేమగా చిగురించిందట. ఇప్పుడు ఇరు పెద్దల అనుమతితో పెళ్లిపీటలు ఎక్కుతున్నారట.

ఇవి కూడా చదవండి

ఇటీవల ఇదే విషయంపై మాట్లాడిన నాగ చైతన్య ‘నా ఓటీటీ షో లాంచ్ కోసం ముంబై వెళ్ళినప్పుడు అదే ప్లాట్‌ఫామ్ తో శోభిత కూడా ఓ షో చేస్తోంది. ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హోస్ట్ చేసిన ఒక ప్రచార కార్యక్రమంలోనే మేమిద్దరం కలిసాం.. మొదటిసారి మేము అప్పుడే కలిసి మాట్లాడుకున్నాం’ అని చెప్పుకొచ్చాడు.

ఇక శోభిత గురించి మాట్లాడుతూ ‘గత కొన్ని నెలలుగా శోభిత, ఆమె కుటుంబం గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.పెళ్లి రోజు కోసం వెయిట్ చేస్తున్నా. ఆ ఇంటి కుటుంబీకులు నన్ను ఓ కొడుకులా చూసుకున్నారు. మా రెండు కుటుంబాలు సేమ్ ఉంటాయని. శోభిత ఓ ఫ్యామిలీ అమ్మాయి. మేమందరం కొన్ని పండగలు కలిసి చేసుకున్నాం’ అని చెప్పుకొచ్చాడు.

నాగ చైతన్య, శోభితల ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఫొటోస్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..