Keerthy Suresh: 15 ఏళ్ల ప్రేమకథ.. ఎట్టకేలకు ప్రియుడిని పరిచయం చేసిన కీర్తి సురేష్.. పోస్ట్ వైరల్

గత కొన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలు నిజమయ్యాయి. మహానటి కీర్తి సురేశ్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ప్రియుడిని పరిచయం చేసిందీ అందాల తార. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కీర్తికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Keerthy Suresh: 15 ఏళ్ల ప్రేమకథ.. ఎట్టకేలకు ప్రియుడిని పరిచయం చేసిన కీర్తి సురేష్.. పోస్ట్ వైరల్
Keerthy Suresh
Follow us
Basha Shek

|

Updated on: Nov 27, 2024 | 12:42 PM

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఓపెన్ అయ్యింది. గత కొన్నిరోజులుగా వస్తోన్న రూమర్లను నిజం చేస్తూ తన ప్రియుడిని అందరికీ పరిచయం చేసింది. దీపావళి సందర్భంగాఆంటోని తట్టిళ్‌తో కలిసి దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఆమె ’15 ఏళ్ల తమ స్నేహ బంధం ఇకపై జీవితాంతం కొనసాగుతుంది’ అని తెలిపింది. ఇద్దరూ కలిసున్న ఫొటోని అయితే పోస్ట్ చేసింది గానీ ఆంటోని ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు కీర్తి. ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గామారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కీర్తికి ముందుస్తుగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొదట ఈ పోస్ట్‌పై నటి రాశీఖన్నా స్పందిస్తూ.. ‘‘మేము ఇప్పుడే తెలుసుకున్నాం. కంగ్రాట్స్‌ లవ్‌’’ అని విష్ చేసింది. ఆ తర్వాత మాళవికా మోహనన్, అరుణ్ విజయ్, త్రిష, అపర్ణాబాల మురళి, సంయుక్తా మేనన్, నిక్కీ గల్రానీ, అనపమా పరమేశ్వరన్, శ్రీకాంత్ ఓదెల, పూజిత పొన్నాడ తదితర సినీ సెలబ్రిటీలు కీర్తికి కంగ్రాట్స్ తెలిపారు.

కాగా కీర్తి సురేశ్ చెప్పిన దానిబట్టి చూస్తే 15 ఏళ్ల ప్రేమ అంటే ఇంటర్మీడియట్‌లో ఒకరికి ఒకరు పరిచయమని తెలుస్తోంది. ఆ తర్వాత  కీర్తి హీరోయిన్ గా కాగా.. ఆంటోని ఖతార్‌ వెళ్లిపోయాడు. ఆ తర్వాత తిరిగి స్వదేశానికి వచ్చి కొచ్చిలో విండో సొల్యూషన్స్ కోసం యాస్పెరాస్ కంపెనీ పెట్టాడు. తర్వాత హోటల్స్ వ్యాపారంలోనూ అడుగుపెట్టాడు.కాగా డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో కీర్తి-సురేష్ ల ఆంటోని తట్టిల్ ను డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని ప్రచారం నడుస్తుంది.  త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

ఇవి కూడా చదవండి

కీర్తి సురేష్ పోస్ట్..

కాగా మలయాళ ప్రముఖ నిర్మాత సురేశ్, నటి మేనకల కూతురైన కీర్తి సురేశ్.. ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. . తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా అదృష్టం పరీక్షించుకోనుంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇంతలోనే పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమైందీ అందాల తార.

బేబీ జాన్ సినిమాలో వరుణ్ ధావన్ , కీర్తి సురేష్..

View this post on Instagram

A post shared by VarunDhawan (@varundvn)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.