AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Akkineni: పెళ్లిపీటలెక్కనున్న అక్కినేని అఖిల్.. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్.. వధువు ఎవరో తెలుసా?

అక్కినేని ఇంట వరుసగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. వచ్చే నెలలోనే అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ వివాహం జరగనుంది. ఈ సమయంలోనే తన రెండో కుమారుడు అక్కినేని అఖిల్ పెళ్లిపై సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన విడుదల చేశారు నాగార్జున

Akhil Akkineni: పెళ్లిపీటలెక్కనున్న అక్కినేని అఖిల్.. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్.. వధువు ఎవరో తెలుసా?
Akhil Akkineni Engagement
Basha Shek
|

Updated on: Nov 26, 2024 | 6:00 PM

Share

అక్కినేని అందగాడు హీరో అఖిల్ త్వరలోనే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. ఇప్పటివరకు ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న అతను త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తాజాగా జైనాబ్ రవడ్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగింది. హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అక్కినేని అఖిల్ నిశ్చితార్థం విషయాన్నినాగార్జునే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. కాబోయే జంట ఫొటోలను కూడా అందులో షేర్ చేశాడు. దీంతో అఖిల్ అక్కినేని ఎంగేజ్ మెంట్ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.  పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో ‘అయ్యగారు సడెన్ గా ఇలా సర్ ప్రైజ్ ఇచ్చారేంటి’? అని సినీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

‘‘జైనబ్‌తో మా తనయుడు అఖిల్ నిశ్చితార్థం జరిగిందని తెలియజేస్తున్నందుకు ఆనందిస్తున్నాం. కోడలిగా జైనబ్‌ను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాబోయే దంపతులకు మీ అందరి దీవెనలు, ఆశీస్సులు కావాలి’ అని నాగార్జున పోస్ట్‌ పెట్టారు. అలాగే అఖిల్‌ కూడా తన శుభవార్తను సామాజిక మాధ్యమాల వేదికగా అందరితో  పంచుకున్నాడు.

అక్కినేని నాగార్జున ట్వీట్..

వధువు వివరాలివే..

కాగా అఖిల్ కు కాబోయే భార్య  జైనాబ్  ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనాబ్ అని తెలుస్తోంది. ఈమెకు స్కిన్ కేర్‌కి సంబంధించిన కంపెనీ లు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, దుబాయి, లండన్‌లో ఈమె సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కూడా అని తెలుస్తోంది. వచ్చే ఏడాది వీరి పెళ్లి ఉంటుందని తెలుస్తోంది.

అఖిల్ ఎంగేజ్ మెంట్ ఫొటోలు..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?