Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed Siraj: ఆ బిగ్‌ బాస్ బ్యూటీకి సిరాజ్ క్లీన్ బౌల్డ్! వైరలవుతోన్న పోస్ట్‌

టీమిండియా స్టార్ బౌలర్, హైదరాబాదీ స్పీడ్ స్టర్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లు ఆడుతోన్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో సిరాజ్ కూడా ఒకడు. ఇక తాజాగా ముగిసిన ఐపీఎల్‌ మెగా వేలం-2025లోనూ ఈ ప్లేయర్ పై కాసుల వర్షం కురిసింది.

Mohammed Siraj: ఆ బిగ్‌ బాస్ బ్యూటీకి సిరాజ్ క్లీన్ బౌల్డ్! వైరలవుతోన్న పోస్ట్‌
Mohammed Siraj
Basha Shek
|

Updated on: Nov 26, 2024 | 8:23 PM

Share

హైదరాబాదీ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్ ఇప్పుడు టీమిండియాలో కీలక ప్లేయర్. మూడు ఫార్మాట్లలోనూ అతను భారత జట్టుకు సేవలందిస్తున్నాడు. ఇక సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్‌ మెగా వేలం-2025లో నూ సిరాజ్‌ కు భారీ మొత్తమే దక్కింది. గత కొన్నేళ్లుగా అతనితో ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరువదిలేసినా.. గుజరాత్‌ టైటాన్స్‌ పట్టుబట్టి మరీ ఏకంగా రూ.12.25 కోట్లతో హైదరాబాదీ బౌలర్ ను కొనుగోలు చేసింది. దీంతో వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటాన్స్‌ జెర్సీలో దర్శనమివ్వనున్నాడు. ఆన్ ఫీల్డ్ లో అగ్రెసివ్ గా ఉండే సిరాజ్ బయట మాత్రం ఎంతో సింపుల్ గా ఉంటాడు. వివాదాల జోలికి వెళ్లడు. లవ్వులు, డేటింగ్స్ వంటి వాటికి కొంచెం దూరంగానే ఉంటాడు. అలాంటిది ఇప్పుడు సిరాజ్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. తన స్పీడ్ బౌలింగ్ తో ప్రత్యర్థులను బెదరగొట్టే ఈ హైదరాబాదీ బౌలర్ ఇప్పుడు ఒక నటి అందానికి క్లీన్ బౌల్డ్ అయ్యాడని సమాచారం. బాలీవుడ్‌కు చెందిన ఓ నటితో అతను డేటింగ్‌ చేస్తున్నాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. క్రికెట్ కాకుండా డేటింగ్ విషయంతో సిరాజ్ ను వార్తల్లోకి తీసుకొచ్చిన ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు మహీరా శర్మ.

మహీరా శర్మ గతంలో హిందీ బిగ్‌బాస్‌ షోలో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. సోషల్ మీడియాలోనూ ఆమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు సిరాజ్ తో డేటింగ్ వార్తలు రావడానికి కారణం కూడా మహీరా ఇన్‌స్టా గ్రామ్ పోస్టులు. తరచూ తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను ఇన్ స్టాలో షేర చేయడం మహీరాకు అలవాటు. అలా తాజాగా బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌తో గ్లామరస్‌ లుక్‌లో కనిపిస్తోన్న ఫొటోలను మహీరా షేర్ చేసింది. ఈ ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. అదే సందర్భంలో మహ్మద్ సిరాజ్ కూడా మహీరా ఫొటోలకు లైక్ కొట్టాడు. అంతే.. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

లైక్ కొట్టినంత మాత్రాన..

ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లతో సిరాజ్, మహీరా పేర్లను ముడి పెట్టి కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు వీరు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో వీటిని చూసిన సిరాజ్‌ అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. లైక్‌ కొట్టినంత మాత్రాన ఇలాంటి ప్రచారం చేయడం తగదని హితవు పలుకు తున్నారు.

మహీరా శర్మ ఫొటోస్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..