AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

ఒకటి రెండు సినిమాల్లో నటించినా ఎప్పటికీ గుర్తుండిపోతుంటారు కొంత మంది అందాల తారలు. ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. కొన్నేళ్ల క్రితం ఒక ప్రేమకథా చిత్రంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన ఈ అందా తార ఇప్పుడు రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందింది.

Tollywood: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Nov 25, 2024 | 8:34 PM

Share

గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన అదితీ దేవ్ శర్మ శుభవార్త చెప్పింది. తాను రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందినట్లు తెలిపింది. తనకు పండంటి మహాలక్ష్మి పుట్టిందన్న శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంది. దీంతో పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అదితీ శర్మ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతు్నారు. ఈ సందర్భంగా తన భర్తతో దిగిన బేబీ బంప్ ఫొటోలను ఆమె షేర్ చేయగా, అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి. కాగా అదితీ శర్మ 2014లో బాలీవుడ్ బుల్లితెర నటుడు సర్వర్ అహుజాను పెళ్లాడింది. 2019లో సర్తాజ్ అనే కుమారుడు జన్మించాడు.ఇప్పుడు వీరి జీవితంలోకి ఆడబిడ్డ అడుగు పెట్టింది. దీంతో ఈ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. ఇదే విషయాన్ని సోషల మీడియా ద్వారా షేర్ చేసుకున్న అదితి.. ‘నా కూతుు రాక కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాం’ అని మురిసిపోయింది. కాగా ప్రస్తుతం పంజాబీ సినిమాలు, బుల్లితెర పై బిజీ బిజీగా ఉంటోన్న అదితీ శర్మ గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించింది. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన గుండె ఝల్లుమంది సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిందీ అందాల తార. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. సినిమా ఫ్లాప్ అయినా అదితీకి మాత్రం మంచి పేరు వచ్చింది. ఇక గుండె ఝల్లు మంది తర్వాత ఓం శాంతి అనే మల్టీ స్టారర్‌ మూవీలో కనిపించింది అదితి. ఇందులో నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్ తదితరులు కూడా ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే బబ్లూ సినిమాలోనూ తళుక్కుమంది.

ఇవి కూడా చదవండి

అయితే ఏమైందో కానీ సడెన్ గా టాలీవుడ్ నుంచి మాయమైపోయింది అదితీ శర్మ. మొత్తం మీద తెలుగు, హిందీ, పంజాబీ, తదితర భాషలలో కలిపి దాదాపుగా 12కి పైగా చిత్రాలలో నటించిందీ అందాల తార. ప్రస్తుతం సీరియల్స్ తో బిజీ బిజీగా ఉంటోంది. గంగా, సిల్సిలా బదల్తే రిష్టన్ కా, కథా అంకాహీ సీరియల్స్‌లో అదితీ పాత్రలకు మంచి పేరు వచ్చింది.

Aditi Sharma

Aditi Sharma

భర్త, కుమారుడితో అదితీ శర్మ..

సీరియల్స్ తో పాటు తన భర్త ఆహుజా బిజినెస్‌ పనులను కూడా చూసుకుంటోంది అదితీ శర్మ. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన భర్త, పిల్లాడికి సంబంధించిన ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది.

దీపావళి వేడుకల్లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.