AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆ హీరోయిన్ చూడటానికి అందంగా ఉంటుంది.. కానీ ఒక్క ఎక్స్ ప్రెషన్ రాదు.. డైరెక్టర్ కామెంట్స్..

దర్శకుడు చంద్ర మహేష్ తన మొదటి సినిమా "ప్రేయసి రావే" షూటింగ్ సమయంలో ఎదురైన పలు ఆసక్తికర విషయాలను తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రానికి హీరోగా ముందు వెంకటేష్‌ను అనుకున్నా, కథకు ఇమేజ్ అడ్డుకాకూడదని ఆ అభిప్రాయాన్ని విరమించుకున్నానని గుర్తుచేసుకున్నారు. అలాగే అనిల్ రెడ్డి కూడా తొలుత హీరోగా అనుకున్నప్పటికీ కుదరలేదని అన్నారు. చివరకు శ్రీకాంత్ కథకు ఆకర్శితులై హీరోగా చేయటానికి ముందుకు వచ్చారని అన్నారు.

Tollywood : ఆ హీరోయిన్ చూడటానికి అందంగా ఉంటుంది.. కానీ ఒక్క ఎక్స్ ప్రెషన్ రాదు.. డైరెక్టర్ కామెంట్స్..
Director Chandra Mahesh
Rajitha Chanti
|

Updated on: Mar 21, 2026 | 2:12 PM

Share

దర్శకుడు చంద్ర మహేష్ తన తొలి చిత్రం “ప్రేయసి రావే” నిర్మాణానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కథానాయకుడు, కథానాయికల ఎంపిక నుండి సాంకేతిక నిపుణుల మార్పుల వరకు ఆయన ప్రయాణంలో ఎదురైన సవాళ్లను వివరించారు. తొలుత, “ప్రేయసి రావే” చిత్రానికి హీరోగా వెంకటేష్‌ను అనుకున్నప్పటికీ, కథకు హీరో ఇమేజ్ అడ్డు రాకూడదనే ఉద్దేశ్యంతో చంద్ర మహేష్ ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆ తర్వాత అనిల్‌ రెడ్డిని సంప్రదించగా, కథ నచ్చి ఆయన అంగీకరించారు. అయితే, నిర్మాత నాయుడు ఒక షరతు విధించారని. తన చిత్రం మొదట రావాలని, హీరో పరిచయ చిత్రంలా ఉండాలని కోరారు. ఇది కుదరకపోవడంతో అనిల్‌తో సినిమా ఆలస్యమైంది. ఈ సమయంలోనే శ్రీకాంత్ కథ విని, చాలా నచ్చి, ఎలాంటి పారితోషికం అయినా తీసుకుంటానని చెప్పి సినిమా చేయటానికి ముందుకు వచ్చారని అన్నారు. ఆ సమయంలో శ్రీకాంత్ పెద్ద హిట్లు లేకపోయినా, కథపై ఆయన నమ్మకం తనకు ఆనందాన్నిచ్చిందని తెలిపారు. అలా “ప్రేయసి రావే” శ్రీకాంత్‌తో ప్రారంభమైందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : హీరోయిన్ ఛాన్స్ వస్తే వద్దని చెప్పింది.. బుల్లితెరపై గ్లామర్ అరాచకం..

“కలిసుందాం రా” చిత్రంలోని ఆర్టిస్టులు ఎవరూ తమ సినిమాలో ఉండకూడదని నాయుడు షరతు విధించారు. కెమెరామెన్ విషయంలో కూడా క్లాష్ ఉండకూడదని భావించి, రవిని తొలగించాల్సి వచ్చిందని. కొత్త కెమెరామెన్ కోసం ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు కే రాఘవేంద్రరావుని కలిశానని అన్నారు.. ఆయన వెంటనే జైరామ్ పేరును సూచించి, ఆయన ఫోన్ నంబర్ ఇచ్చారు. జైరామ్ అప్పటికి ఖాళీగా ఉండటంతో, వెంటనే చెన్నై నుండి హైదరాబాద్‌కు వచ్చి ప్రాజెక్ట్‌లో చేరారని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‏లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..

హీరోయిన్ ఎంపిక ప్రక్రియ మరింత ఆసక్తికరంగా సాగింది. “ప్రేయసి రావే” కోసం మొదట సౌందర్యను అనుకున్నామని.. ఆమెకు కథ నచ్చినప్పటికీ, డేట్స్ సమస్యల వల్ల సినిమా చేయలేకపోయారని తెలిపారు. ఆమె ఆరు నెలలు సమయం కోరడంతో, నాయుడు గారు అంగీకరించలేదు. అప్పుడు రెండో ఆప్షన్‌గా రాశిని సంప్రదించానని అన్నారు.. రాశి డేట్స్ ఖాళీగా ఉండటంతో, షూటింగ్ రోజునే ఆమెను పరిచయం చేసుకుని ఓకే చేశారు. రాశి సెంటిమెంట్ పాత్రలకు బాగా సరిపోతుందని, ఆమె గత చిత్రాలైన “శుభాకాంక్షలు”, “సుస్వాగతం”, “గోకులం లో సీత” వంటి సినిమాలను చూసి ఆమెను ఎంపిక చేసినట్లు దర్శకుడు తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : RP Patnaik: ఆ పాటకు రాత్రంతా డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. అది ఎప్పటికీ మర్చిపోలేను.. మ్యూజిక్ డైరెక్టర్..

ఈ చర్చ జరుగుతున్న సమయంలో, నిర్మాత నాయుడు సాక్షి శివానంద్‌ను హీరోయిన్‌గా సూచించారు. అయితే, దీనిపై తాను అభ్యంతరం వ్యక్తం చేశానని తెలిపారు. సాక్షి శివానంద్ చూడటానికి అందంగా ఉన్నప్పటికీ, భావోద్వేగ సన్నివేశాలకు అవసరమైన అభినయాన్ని పలికించలేదని, ఆమెకు నటన రాదని చంద్ర మహేష్ అభిప్రాయపడ్డారు. గ్లామర్ పాత్రలకు ఆమె సరిపోతారని, కానీ “ప్రేయసి రావే” కథకు ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే నటి కావాలని ఆయన వివరించారు. సాక్షి నటించిన “మాస్టర్” వంటి చిత్రాలను చూసి ఈ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. తర్వాత సిమ్రాన్‌ను కూడా పరిశీలించినా, ఆమె డేట్స్ కూడా దొరకకపోవడం, “కలిసుందాం రా”లో ఆమె నటిస్తుండటంతో నాయుడు గారు అంగీకరించలేదు. “ప్రేమించుకుందాం రా” సినిమాలో రెండో పాత్రకు సంఘవిని ఎంపిక చేయడం సరైన నిర్ణయమని కూడా ఆయన పేర్కొన్నారు.

Sakshi Shivanand

Sakshi Shivanand

ఎక్కువ మంది చదివినవి : Suddala Ashok Teja : ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.. రచయిత సుద్దాల అశోక్ తేజ..

Follow Us