AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‏లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..

ఫోక్ సాంగ్స్.. ఈ వైబ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో పాడుకునే అచ్చమైన పల్లె పాటలు.. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాటలే వినిపిస్తున్నాయి. ఇక నెట్టింట మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు ఒక పాట నెల రోజులుగా తెగ ట్రెండ్ అవుతుంది. ఎక్కడ చూసిన ఈ పాటకే స్టెప్పులేస్తున్నారు.

Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‏లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..
Folk Song (5)
Rajitha Chanti
|

Updated on: Mar 20, 2026 | 11:35 AM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ చేస్తున్న రచ్చ గురించి చెప్పక్కర్లేదు. సినిమా పాటలకు మించిన వ్యూస్, రెస్పాన్స్ అందుకుంటూ యూట్యూబ్ లో దుమ్మురేపుతున్నాయి. పల్లె గొంతుల్లో వచ్చే ప్రతి పాట ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. భాష అర్థం కాకపోయినా యావత్ దేశవ్యాప్తంగా ఈ పాటలు మారుమోగుతున్నాయి. ఇక ఇప్పుడు ఎక్కడ విన్నా పల్లె పాటలే వినిపిస్తున్నాయి. పెళ్లి వేడుకలు, పండగలు, స్కూల్ వీడ్కోల కార్యక్రమాల్లోనూ ఈ ఫోక్ పాటలకే స్టెప్పులేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సాంగ్స్ దూసుకుపోతుండగా.. ఇప్పుడు మరో సాంగ్ ఆకట్టుకుంటుంది. నెల రోజుల క్రితం విడుదలైన ఈ పాటకు ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా డ్యాన్స్ చేస్తున్నారు. ఆ సాంగ్ పేరు “కాళ్ల కడియాల్ లేవు.. ” ఈ పాటలోని మాస్ బీజీఎమ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Naresh: నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. ఒక్కో ఈవెంట్‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్..

“కాళ్ళ గడియాలు లేవు వంగిన జుంపా లెక్కలయ్యా, కాళ్ళే కాదిమ్మనయో వంగిన జుంపా లెక్కలయ్యా.. కాళ్ళ గడియాలు జెట్టా రింగుల చుట్టూ వెంకటమ్మ, పెట్టు పడినా చెత్త రావే రింగుల చుట్టూ వెంకటమ్మ” అంటూ సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకుపోతుంది. చిన్న పెద్దా తేడా లేకుండా ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. ఈ పాటను ఫోక్ సింగర్ వెంకటమ్మ రాసి పాడారు. అలాగే దండు హనుమంతు సైతం అద్భుతంగా ఆలపించారు. ఈ పాటకు అదిరిపోయే మాస్ మ్యూజిక్ అందించారు రాజు మాల్.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా.. టాలీవుడ్ నటుడు..

ఇక ఈ పల్లె పాటకు బిట్టు, ఏఎంఆర్ మాస్టర్ ఎనర్జిటిక్ డ్యాన్స్ తో అదరగొట్టేశారు. ఇప్పుడు ఈ పాట యావత్ సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలేస్తుంది. ముఖ్యంగా డీజే మోతల్లో ఈ సాంగ్ మారుమోగుతుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎక్కడ విన్నా ఈ పాటే వినిపిస్తుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..

Follow Us
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్
కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్
షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!
షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!
చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...
చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !
ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !