టాలీవుడ్‏లో సైలెంట్ అయిన కుర్ర హీరోయిన్.. అమ్మాడిని పట్టించుకోవట్లేదా

Rajitha Chanti

Pic credit - Instagram

21 March 2026

నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికతో సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో యూట్యూబ్ వీడియోస్ చేసింది ఈ భామ. 

షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఈ అమ్మడు.. మల్లేశం సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది.

తనే హీరోయిన్ అనన్య నాగళ్ల. మొదటి సినిమా తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో మరింత పాపులారిటి వచ్చేసింది. ఆ తర్వాత విభిన్న కథలను ఎంచుకుంటూ బీజీగా ఉండిపోయింది.

ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు ఇప్పుడు అంతగా కనిపించడం లేదు.

చాలా రోజులుగా ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తుంది అనన్య. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది. 

తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గ్లామరస్ లుక్స్ తో కట్టిపడేస్తుంది అనన్య నాగళ్ల.

అనన్య నాగళ్ల.. పక్కా తెలుగమ్మాయి. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. ఇప్పుడు తనదైన ముద్ర వేసింది.