IPL Auction 2025: ఆ టీమిండియా డ్యాషింగ్ ప్లేయర్ కోసం కోట్లు కుమ్మరించిన ఆర్సీబీ.. ఈసారైనా కప్ కొడుతుందా?

ఐపీఎల్ మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టీ20 స్పెషలిస్టులనే కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే ఫిల్ సాల్ట్, లివింగ్ స్టోన్, హేజిల్ వుంట్ వంటి స్టార్స్ ను కొనుగోలు చేసిన ఆర్సీబీ ఇప్పుడు టీమిండియా స్టార్ బ్యాటర్ పై కాసుల వర్షం కురిపించింది.

IPL Auction 2025: ఆ టీమిండియా డ్యాషింగ్ ప్లేయర్ కోసం కోట్లు కుమ్మరించిన ఆర్సీబీ.. ఈసారైనా కప్ కొడుతుందా?
Team India Cricketer
Follow us
Basha Shek

|

Updated on: Nov 24, 2024 | 9:43 PM

ఐపీఎల్ 2025 మెగా వేలానికి కోటి రూపాయల బేస్ ధరతో తన పేరును నమోదు చేసుకున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మ ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరాడు. 2022 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టులో చేరిన జితేష్. గత రెండు ఎడిషన్లలో జట్టు తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చిన జితేష్‌ను ఇప్పుడు RCB 11 కోట్లకు కొనుగోలు చేసింది. తన దూకుడు బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన జితేష్, అరంగేట్రం సీజన్ లో ఆడిన 12 మ్యాచ్‌ల్లో 164 స్ట్రైక్ రేట్‌తో 234 పరుగులు చేశాడు. IPL 2023లో పంజాబ్ కింగ్స్ తరపున మొత్తం 14 మ్యాచ్‌లు ఆడాడు జితేష్. 155 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 309 పరుగులు చేశాడు. ఐపీఎల్ రెండు ఎడిషన్లలో మంచి ప్రదర్శన కనబరిచిన జితేష్ 2023లో టీమ్ ఇండియా తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు. జితేష్ ఇప్పటివరకు టీమ్ ఇండియా తరఫున 9 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మెగా వేలంలో లక్నో, సిఎస్‌కె, ఢిల్లీ క్యాపిటల్స్, ఇతర ఫ్రాంచైజీలు జితేష్ శర్మను కొనుగోలు చేయడానికి బాగా పోటీ పడ్డాయి. అయితే ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ డ్యాషింగ్ ప్లేయర్ ను రూ. 11 కోట్లకు కొనుగోలు చేసింది.

కాగా ఈ మెగా ఆక్షన్‌లో టీ20 స్పెషలిస్టులు అయిన జితేష్ శర్మతో పాటు లియామ్ లివింగ్‌స్టొన్, ఫిల్ సాల్ట్, పేస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్‌ను కొనుగోలు చేసింది ఆర్సీబీ. ఇంగ్లాండ్‌కు చెందిన లియామ్ లివింగ్‌స్టొన్- రూ.8.75 కోట్లు, ఫిల్ సాల్ట్- 11.50 కోట్లు, టీమిండియా ప్లేయర్ జితేష్ శర్మ- 11 కోట్లు, ఆస్ట్రేలియాకు చెందిన హేజిల్‌వుడ్- 12.50 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది.

ఇవి కూడా చదవండి

రూ. 11 కోట్లతో జితేష్ శర్మ కొన్న ఆర్సీబీ..

జితేష్ శర్మకు ఐపీఎల్ లో మంచి రికార్డు ఉంది. పైగా అంతర్జాతీయ టీ20ల్లోనూ ఆడిన అనుభవముంది. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చే జితేష్ భారీ షాట్లు బాగా కొట్టగలడు. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోట్లు ధారపోసి ఈ డ్యాషింగ్ ప్లేయర్ ను సొంతం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.