Tollywood: మొదటి సినిమాకే నంది, ఫిల్మ్‌ ఫేర్ అవార్డులు.. ఇప్పుడు పెళ్లి రూమర్లతో వార్తల్లో.. గుర్తు పట్టారా?

సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. కొందరు సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. మరికొందరు ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఒక్కో మెట్టూ ఎక్కుతూ నటులుగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ స్టార్ హీరోయిన్ కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది.

Tollywood: మొదటి సినిమాకే నంది, ఫిల్మ్‌ ఫేర్ అవార్డులు.. ఇప్పుడు పెళ్లి రూమర్లతో వార్తల్లో.. గుర్తు పట్టారా?
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Nov 23, 2024 | 5:35 PM

ప్రస్తుతం మన సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటీనటులుగా కొనసాగుతోన్న చాలా మంది కెరీర్ ఆరంభంలో షార్ట్ ఫిల్మ్స్ చేసిన వారే. సోషల్ మీడియా వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్నవారే. పై నున్న హీరోయిన్ కూడా ఈ జాబితాకే చెందుతుంది. కెరీర్ ప్రారంభంలో ఆమె పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. సోషల్ మీడియా వీడియోలతోనూ ఫేమస్ అయ్యింది. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీలో అదృష్టం పరీక్షించుకుంది. అయితే ప్రారంభంలో చిన్న, చితకా వేశాలు వచ్చేశాయి. స్టార్ హీరోయిన్లకు ఫ్రెండ్ గా, అక్కగా, చెల్లిగా నటించింది. ఈ క్రమంలోనే హీరోయిన్ గా అవకాశాలు సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఏకంగా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ క్రేజీ యెస్ట్ హీరోయిన్లలో ఈ బ్యూటీ కూడా ఒకరు. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ.. ఈ హీరోయిన్ గురించి ఇటీవల ఒక రూమర్ బాగా వైరలవుతోంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద ఫ్యామిలీకి ఈ హీరోయిన్ కోడలిగా వెళ్లనుందని సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రచారం జరుగుతోంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. ఈ బ్యూటీ మరెవరో కాదు ఇటీవలే స్వాగ్ సినిమాతో మెప్పించిన రీతూ వర్మ. ఇది ఆమె చిన్ననాటి ఫొటో.

ఈ ఏడాది కేవలం ఒక్క సినిమాలోనే కనిపించింది రీతూ వర్మ. శ్రీ విష్ణు నటించిన స్వాగ్ సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్ గా కనిపించింది. అయితే ఇందులో ఆమె రెండు పాత్రల్లో అభిమానులను అలరించింది. ప్రస్తుతం సందీప్ కిషన్ తో కలిసి మజాకా అనే సినిమాలో నటిస్తోందీ అందాల తార. అలాగే తమిళంలోనూ ఒక క్రేజీ ప్రాజెక్టులోనూ యాక్ట్ చేస్తోందీ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి

దీపావళి వేడుకల్లో రీతూ వర్మ..

View this post on Instagram

A post shared by Ritu Varma (@rituvarma)

కాగా సాధారణంగా రీతూ వర్మ వివాదాలు, రూమర్లకు దూరంగా ఉంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి చేసుకోనుందని ప్రచారం జరుగుతోంది. అది కూడా ఒక పెద్దింటి హీరోతోనని రూమర్లు బాగా వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్లపై ఇప్పటివరకు రీతూ స్పందించలేదు.

రీతూ వర్మ గ్లామరస్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Ritu Varma (@rituvarma)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..