AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘మరోసారి అమ్మను కాబోతున్నా’.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

హీరోలతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. హీరోలు పెళ్లై, పిల్లలు పుట్టినా సినిమాలు చేస్తుంటారు. కానీ కొందరు హీరోయిన్లు పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోతారు. ఈ హీరోయిన్ కూడా సరిగ్గా ఈ జాబితాలోకే వస్తోంది.

Tollywood: 'మరోసారి అమ్మను కాబోతున్నా'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
Sana Khan
Basha Shek
|

Updated on: Nov 22, 2024 | 9:14 PM

Share

సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగి హఠాత్తుగా కనుమరుగైన హీరోయిన్లలో సనా ఖాన్‌ ఒకరు. 2005లో హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అందాల తార తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ కు ఈ ముద్దుగుమ్మ బాగా సుపరిచితం. 2010లో కల్యాణ్ రామ్ నటించిన కత్తి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సనాఖాన్‌. ఆ తర్వాత నాగార్జున గగనం, మంచు మనోజ్‌ మిస్టర్‌ నూకయ్య సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఇక బాలీవుడ్ లో సల్మాన్‌ ఖాన్‌ జయహో, అక్షయ్‌ కుమార్‌ టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథా వంటి హిట్ సినిమాల్లోనూ సందడి చేసింది. అంతకుముందు హిందీ బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొని సెకండ్ రన్నరప్ గా నిలిచింది. మొత్తం మీద 14 సినిమాలు, 50కు పైగా యాడ్లలో నటించిన సనాఖాన్ తన సినిమా కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే ఇండస్ట్రీ కి దూరమైంది. 2019లో విశాల్ నటించిన అయోగ్యలో చివరిగా కనిపించిన ఆ మరుసటి ఏడాదే దుబాయ్ కు చెందిన ముస్లిం మతగురువు, వ్యాపార వేత్త ముఫ్తీ అనస్ సయ్యద్ ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత దుబాయ్‌ వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయింది.

సనాఖాన్, అనస్ సయ్యద్ దంపతులకు 2023లో ఒక పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరోసారి అమ్మగా ప్రమోషన్ పొందనుంది. . ‘మేము ముగ్గురం నలుగురం కాబోతున్నాం’ అంటూ ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సనా దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

సనాఖాన్ షేర్ చేసిన వీడియో..

భర్త తో సనాఖాన్..

ఫ్యామిలీతో సనా ఖాన్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

Follow Us
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
డబ్బు కోసం ఇంత దారుణమా.. ? రష్మీ ఎమోషనల్ పోస్ట్..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
నవరాత్రుల్లో ఇంటికి ఈ 6 వస్తువులు తెచ్చుకోండి.. సుఖసంతోషాలు..
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భోగి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
వలలో ఈ చేప చిక్కింది.. జాలరి పంట పండింది..
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
శుక్ర మూఢమిలోనూ వీరికి శుభాలు! అదృష్టం పట్టే రాశులివే..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపమా