Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rocking Rakesh: రాకింగ్ రాకేష్ ‘కేసీఆర్’ సినిమా టికెట్ రేట్లు భారీగా తగ్గింపు.. కారణమిదే

జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన మొదటి చిత్రం కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్). ఈ సినిమాతో హీరోగానే కాకుండా నిర్మాతగానూ అదృష్టం పరీక్షించుకుంటున్నాడీ స్టార్ కమెడియన్.

Rocking Rakesh: రాకింగ్ రాకేష్ 'కేసీఆర్' సినిమా టికెట్ రేట్లు భారీగా తగ్గింపు.. కారణమిదే
Rocking Rakesh
Follow us
Basha Shek

|

Updated on: Nov 21, 2024 | 8:55 PM

మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన రాకేష్ జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అందులో తన కామెడీ స్కిట్స్ తో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఇక ఇప్పుడు తనను హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై చూసుకునేందుకు సిద్ధమయ్యాడు. అతను నటించిన చిత్రం కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) శుక్రవారం (నవంబర్ 22)న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. ప్రముఖ సీనియర్ నటి సత్య కృష్ణన్ కూతురు అన్నన్య కృష్ణన్ ఇందులో కథానాయికగా నటిస్తుండడం విశేషం. హీరోగా నటించడంతో పాటు రాకింగ్ రాకేష్ స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా కేసీఆర్ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న హీరో, నిర్మాత రాకింగ్ రాకేష్ తన సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘నా సినిమాలో కేసీఆర్ నటించారు. అదే నా సినిమాకి ఓపెనింగ్స్ తీసుకొస్తుందని అనుకుంటున్నాను. ఆయనకి తెలీయకుండా ఆయన్ని పెట్టి సినిమా తీసా. అలా ఈ సినిమాలో చాలా మ్యాజిక్కులు ఉంటాయి . ఈ శుక్రవారం వస్తున్న అన్ని సినిమాలు చూడండి. అందులో నా ప్రయత్నాన్ని కూడా ఆశీర్వాదించండి. ఆడియెన్స్ కు మా సినిమా రీచ్ కావాలనే ఉద్దేశంతో టికెట్ రేట్స్ కూడా భారీగా తగ్గించాం. టికెట్ వందరూపాయిలే. సంధ్యా లాంటి థియేటర్స్ లో టికెట్ 80, 50 రూపాయలకే దొరుకుతుంది’ అని రాకింగ్ రాకేష్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

తన సినిమా పోస్టర్లు తనే గోడపై అతికిస్తూ..

View this post on Instagram

A post shared by Tag Telugu (@tag.telugu)

ఇదిలా ఉంటే రాకింగ్ రాకేష్ అర్ధరాత్రి పూట హైదరాబాద్ రోడ్ల మీద నడుస్తూ తన కేసీఆర్ సినిమా పోస్టర్స్ ని తానే గోడలకు అతికిన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ గా మారింది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు అతని కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందని, కేసీఆర్ సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. కేసీఆర్ సినిమా శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

మాజీ మంత్రి హరీష్ రావుతో రాకింగ్ రాకేష్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.