Siva Karthikeyan: షూటింగ్‌ సెట్‌లో అందరికీ బిర్యానీ వడ్డించిన హీరో శివ కార్తికేయన్.. వీడియో వైరల్

కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. అతను నటించిన తాజా చిత్రం అమరన్. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ఈ ఆనందంలో ఉండగానే మరో సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు శివ కార్తికేయన్.

Siva Karthikeyan: షూటింగ్‌ సెట్‌లో అందరికీ బిర్యానీ వడ్డించిన హీరో శివ కార్తికేయన్.. వీడియో వైరల్
Siva Karthikeyan
Follow us
Basha Shek

|

Updated on: Nov 20, 2024 | 7:32 PM

ఉగ్రవాదుల చేతుల్లో అసువులు బాసిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం అమరన్. శివ కార్తికేయన్ ముకుంద్ పాత్రలో, అతని భార్య ఇందు వర్గీస్ రెబెక్కా పాత్రలో సాయి పల్లవి నటించారు. రాజ్ కుమార్ పెరియా స్వామి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న అమరన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. తమిళంతో పాటు కన్నడలోనూ ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. రిలీజై ఇప్పటికీ మూడు వారాలు గడుస్తున్నా చాలా చోట్ల అమరన్ సినిమా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇక ఇప్పటివరకు అమరన్ సినిమాకు రూ. 300 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయంటున్నారు ట్రేడ్ పండితులు. దీంతో చిత్ర బృందమంతా సంతోషంలో మునిగితేలుతోంది. ఇదిలా ఉంటే అమరన్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మరో సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు శివ కార్తికేయన్. ఎస్‌కే23 వర్కింగ్‌ టైటిల్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజాగా ఇదే మూవీ సెట్ లో అమరన్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అనంతరం ఇదే షూటింగ్ సెట్‌లోనే అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో శివ కార్తికేయన్ స్వయంగా అందరికీ బిర్యానీ వడ్డించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషన్ బ్యానర్ పై ప్రముఖ నటుడు కమల్ హాసన్ అమరన్ సినిమాను నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలో భువన్ అరోరా, రాహుల్ బోస్, లల్లు, శ్రీకుమార్, శ్యామ్ మోహన్, గీతా కైలాసం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా శివ కార్తికేయన్ సినిమా కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అమరన్ నిలిచింది. ఇప్పటికే రూ. 300 కోట్లను దాటేసిన ఈ సినిమా ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ. 400 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టవచ్చని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

వీడియో ఇదిగో..

కలెక్షన్లలో అసలు తగ్గేదేలే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.